మ్యాగీ తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ మ్యాగీ అంటే అదో రకం పిచ్చి. మాగీ తయారు చేయడం కూడా చాలా సులభం.. అలాగే తింటున్నప్పుడు కూడా ఆ రుచి వేరుగా ఉంటుంది. మనకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఈజీగా.. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. త్వరగా ఏదైన తినాలి అనిపిస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కూడా మ్యాగీ. గత రెండు రోజులుగా ఓ మిర్చీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజనం తెగ లైకులు, షేర్లు చేస్తున్నారు. అంతే కాదు ఈ మ్యాగీ మిర్చీ రెసిపీ వేగంగా షేర్ అవుతోంది. ఇది చూసిన సోషల్ మీడియా యూజర్లు తెగ ఆశ్చర్య పోతున్నారు.
ఈ రెసిపిపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. నూడుల్స్ కొత్త వెర్షన్ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చింది. అంతేకాదు కామెంట్స్ కూడా జోడిస్తున్నారు. వైరల్ అవుతున్న చిత్రంలో పచ్చడి మిరపకాయను తయారు చేసే పద్దతిని కూడా మీరు చూడవచ్చు. ఈ మిరపకాయ బజ్జీ మధ్యలో మ్యాగీ నూడుల్స్ చూసి షాక్ అవుతున్నారు. ఈ కొత్త మ్యాగీ డిష్‌కు స్టఫ్డ్ మ్యాగీ చిల్లీ అని పేరు కూడా పెట్టారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూద్దాం..
Stuffed Maggie mirch ? pic.twitter.com/hnBhek4031
— जिज्ञासा (@imcurious__) September 28, 2021
I know people will throw chappals at me for this, but I think this might actually taste ok with a few changes, roast the mirch, add some grated cheese, sliced green onions & chilli flakes on the Maggi & bake it for few mins. till browned & gooey. Serve with spicy ketchup.??
— Savitri Mumukshu – सावित्री मुमुक्षु (@MumukshuSavitri) September 29, 2021
Mat karo ye sab pic.twitter.com/lUgMa79lSM
— ₳ (@Woh_ladka) September 29, 2021
Stuffed Maggie mirch ? pic.twitter.com/hnBhek4031
— जिज्ञासा (@imcurious__) September 28, 2021
— ? (@mindspacemafia) September 28, 2021
Stuffed Maggie mirch ? pic.twitter.com/hnBhek4031
— जिज्ञासा (@imcurious__) September 28, 2021
సోషల్ మీడియాలో ఈ స్టఫ్డ్ మ్యాగీ చిల్లీ చిత్రాన్ని చాలా ఇష్టపడుతున్నారు. అంతేకాదు మ్యాగీ కాంబోలను ఇష్టపడనవారు తెగ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ట్విట్టర్ మండిపోతోంది అంటూ ట్వీట్ చేస్తే.. కాదు.. కాదు చాలా రుచిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.