Viral News: కొంపముంచిన పవర్ కట్.. వధువు తారుమారు.. సీన్ కట్ చేస్తే..

Viral News: ఒక వధువుతో పెళ్లి నిశ్చయమైతే.. మరొక వధువుతో పెళ్లి అవడం, ఒక వరుడితో వివాహం ఫిక్స్ అయితే.. మరో వరుడితో పెళ్లి జరిగిపోవడం..

Viral News: కొంపముంచిన పవర్ కట్.. వధువు తారుమారు.. సీన్ కట్ చేస్తే..
Bride
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2022 | 7:56 PM

Viral News: ఒక వధువుతో పెళ్లి నిశ్చయమైతే.. మరొక వధువుతో పెళ్లి అవడం, ఒక వరుడితో వివాహం ఫిక్స్ అయితే.. మరో వరుడితో పెళ్లి జరిగిపోవడం ఇవన్నీ సినిమాల్లోనే చూసుంటాం. కానీ, ఇలాంటి ఘటన నిజంగానే జరిగితే.. ఆ ఘటనకు కరెంట్ కారణం అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే, ఇక్కడ ఊహించుకోవడానికి ఏం లేదు.. నేరుగా చూసేయడమే మిగిలి ఉంది. అవును.. సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి సీన్లు.. తాజాగా ఓ జంట నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది. పెళ్లి సమయంలో కరెంట్ పోవడంతో.. ఒకరి మెడలో తాళి కట్టడానికి బదులు.. మరొకరి మెడలో తాళి కట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్‌ ఇద్దరు కుమార్తెలు నిఖిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన అబ్బాయిలు దంగార్వా భోలా, గణేష్‌తో పెళ్లి నిశ్చయించారు. అయితే, సరిగ్గా మూహర్తం సమయంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వధూ వరులు బురఖాలో ఉండటం, ఇద్దరి దుస్తులు ఒకేలా ఉండటంతో పెద్ద పొరపాటే జరిగిపోయింది. ముహూర్తం సమయంలో కరెంట్ పోవడంతో.. ఈ గందరగోళం చోటు చేసుకుంది. నిశ్చయించిన జంట బదులు.. వేరు వేరు జంటలుగా కూర్చున్నారు. అలాగే పెళ్లి తంతు మొత్తం ముగిసింది. ఒకరికి బదులు మరొకరిని వివాహం చేసుకున్నారు. తాళి కట్టడం, పెళ్లి తంతు మొత్తం ముగిసిన తరువాత అసలు విషయం బయటపడింది. కొద్దిసేపు అక్కడ ఉద్విగ్నభరితమైన వవాతావరణం నెలకొంది. వాగ్వాదం జరిగింది. చివరకు మరోసారి పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చి.. సైలెంట్ అయ్యారు.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?