Viral Video: తల్లి కోసం తల్లడిల్లుతున్న పిల్ల గుర్రం.. బస్‌పై పోస్టర్‌ను చూసి తన తల్లి అనుకుని 3 కిలోమీటర్లు..

Viral Video: తల్లి ప్రేమ వర్ణించలేనిది. అది మానవ మాతృమూర్తి అయినా.. సకల చరాచర జీవులలో ఏ తల్లి జీవి అయినా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.

Viral Video: తల్లి కోసం తల్లడిల్లుతున్న పిల్ల గుర్రం.. బస్‌పై పోస్టర్‌ను చూసి తన తల్లి అనుకుని 3 కిలోమీటర్లు..
Horse
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 13, 2022 | 6:16 AM

Viral Video: తల్లి ప్రేమ వర్ణించలేనిది. అది మానవ మాతృమూర్తి అయినా.. సకల చరాచర జీవులలో ఏ తల్లి జీవి అయినా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. గర్భంలో మోసి, జన్మనిచ్చింది మొదలు.. తాను ఉన్నంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. తన బిడ్డకు ఎలాంటి అపాయం జరుగకుండా రక్షించుకుంటుంది. బిడ్డ కూడా అమ్మ ప్రేమకు అలాగే బానిస అవుతారు. ఒక్క క్షణం తమ తల్లి కనిపించకపోతే తల్లడిల్లిపోతారు. అది మనుషులు, జంతువులైనా, పక్షులైనా తల్లీ బిడ్డల ప్రేమ ఒకేలా ఉంటుంది. తాజాగా ఇలాంటి తల్లి, బిడ్డల ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తల్లి కోసం ఆ బిడ్డ పడుతున్న తపన చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడు కోయంబత్తూరులో తల్లిగుర్రం కోసం పిల్ల గుర్రం పడిన ఆరాటం అంతాఇంతా కాదు. బత్తిశ్వర ఆలయం సమీపం నుంచి వారం క్రితం తల్లి గుర్రం తప్పిపోయింది. దీంతో పిల్లగుర్రం తన తల్లి కోసం వెతుకులాట ప్రారంభించింది. పేరూరు బస్ స్టేషన్ దగ్గర ఓ ప్రైవేట్ బస్సులో తల్లి గుర్రంలాగే ఓ స్టిక్కర్‌ కనిపించడంతో బస్సుని అడ్డగించింది. బస్సుని వెంబడిస్తూ మూడు కిలోమీటర్లు పరుగెత్తింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేగారు. తల్లికోసం ఆరాటపడుతున్న పిల్ల గుర్రం ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెడుతున్నారు. ఈ పిల్ల గుర్రం తన తల్లి గుర్రం చెంతకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..