Viral Video: కరేబియన్ సముద్రంలో వింత సముద్ర జీవిని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. తొలిసారి వింత జీవిని చూసి షాక్ అయ్యారు సైంటిస్టులు. నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్పరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) శాస్త్రవేత్తల బృందం ఇటీవల సముద్రంలో పరిశోధన చేపట్టింది. సెయింట్ క్రోయిక్స్‌కు నైరుతి దిశలో చేపట్టిన యాత్రలో విచిత్రమైన ‘బ్లూ గూ’ జంతువను గుర్తించారు సైంటిస్టులు. ఆ జీవి ఒక ఫజిల్‌లా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని శరీరం ఒక ముద్దగా ఉంటుంది. సాఫ్ట్ బాల్‌లా కనిపిస్తున్న ఈ విచిత్ర జీవి.. సైంటిస్టుల మైండ్ బ్లాంక్ చేసింది. దీనిని శాస్త్రవేత్తలు బేబీ డ్రాగన్ అని ముద్దుగా పిలుస్తున్నారు. అయితే, ఈ వింత జీవి ఏంటా? అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. దానికంటే ముందు.. ఈ విచిత్ర జీవి గురించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియోపై నెటిజన్లు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. ఆ వింత జీవి ఏంటా అని వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Have you heard about the latest #Okeanos mystery? Seen multiple times during off St. Croix, this “blue #goo” animal stumped scientists, who thought it might be soft coral, sponge, or tunicate (but def not a rock!).