పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. పాము ఉన్న చోటు నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను రక్షించుకుంటారు. కానీ కొందరు మాత్రం పాముతోనే ఆటలాడుతుంటారు.. పామును ఇంట్లోనే పెంచుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. (Viral Video)ఇటీవల పాములను ఆటాలడుకుంటున్నా చిన్నారులు.. పాముకు ఆహారం పెడుతూ.. వాటితో ఎంజాయ్ చేస్తోన్న వీడియోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా పామునే మెడలో వేసుకున్నాడు.. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది..
ఆ వీడియోలో ఓ వ్యక్తి చిన్న పామును ఆ బుడ్డోడి ముందుకు తీసుకువచ్చి చూపిస్తాడు. అందరూ పామును ఆలాగే చూస్తుండగా.. ఆ చిన్నోడు మాత్రం ఏకంగా పామును పట్టుకుని మెడలో వేసుకున్నాడు.. అంతేకాదు.. ఆ తర్వాత మెడలో నుంచి తీసి.. చేతిలో పట్టుకుని మడత బెట్టాడు.. అయితే ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా భయంతో షాకవుతారు.. కానీ ఆ వీడియో క్యాప్షన్ చూస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఎందుకంటే.. పాము రబ్బర్ పాము.. ఈ వీడియోను అబిన్జోసేఫ్ అనే ఇన్ స్టా యూజర్ షేర్ చేస్తూ ఆ పాము రబ్బరు పాము అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. తలైవా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..