అడవిలో జీవనపోరాటాలు వేటాడటంపై ఆధారపడి ఉంటాయి. క్రూర జంతువులు ఆహారం కోసం వేటాడతే.. సాధు జంతువులు వాటి నుంచి తప్పించుకుంటూ ప్రాణాలు రక్షించుకోవాలి. అడవిలో చట్టాలు ఇవే. వ్యూహాన్ని, వేగాన్ని ప్రదర్శించకపోతే జంతువుల వేట కొనసాగదు. ముఖ్యంగా చిరుత, సింహం, పులి, మొసలి లాంటి జంతువులు వేటాడేటప్పుడు వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాయి. ఆహారంగా తాము ఎంచుకున్న ఎర ఎక్కడికీ తప్పించుకోకుండా క్షణాల్లో మట్టుబెట్టి వేటాడతాయి.
చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి అద్భుతమైన వేటగాళ్లు. వేట సమయంలో చిరుతలు వేగాన్ని, వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాయి. మరి ఇంతటి బలశాలి.. మరో బలశాలిని వేటాడేటప్పుడు అత్యంత తెలివిని ప్రదర్శిస్తుంది. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఏ జంతువునైనా క్షణాల్లో మట్టుబెడుతోంది. అలాంటి మొసలిని ఓ చిరుత వేటాడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిరుత నీళ్లలోని మొసలిని మట్టుబెట్టేందుకు నక్కి ఉన్నట్లు మీరు చూడవచ్చు. అది నీళ్లలో ఉండి మొసలిని గమనిస్తూ.. సరైన సమయం కోసం వేచి చూసింది. ఆ క్షణం రావడంతో వెంటనే మొసలిపై దాడికి దిగింది. తన పదునైన దవడలతో దాన్ని పట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఇంకేముంది.. ఈ యుద్ధంలో మొసలి ఓడిపోక తప్పదు. ప్రస్తుతం ఈ పోరుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.!
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!