Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆనందంతో గాల్లో తేలిపోతున్న వధువు… ఆ సంతోషానికి గల కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

ప్రతి జీవితంలో పెళ్లి ఓ కీలక ఘట్టం. వివాహ సమయంలో అమ్మాయికి సంతోషంగానే కాకుండా..

Viral Video: ఆనందంతో గాల్లో తేలిపోతున్న వధువు... ఆ సంతోషానికి గల కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 6:34 PM

ప్రతి జీవితంలో పెళ్లి ఓ కీలక ఘట్టం. వివాహ సమయంలో అమ్మాయికి సంతోషంగానే కాకుండా.. ఒకింత భయంతోనూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక కొత్త కుటుంబంతో మమేకం కావాల్సి వస్తుంది. అలాగే జీవిత భాగస్వామిగా పరిచయం లేని వ్యక్తితో.. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ పెళ్లి సమయంలో వధువు సంతోషంతో చిందులు వేయడం చాలా అరుదు. ఇటీవల సోషల్ మీడియాలో వధువులు వివాహం అనంతరం సంతోషంతో చిందులు వేయడం చూస్తున్నాము. అయితే ఇప్పటివరకు పెళ్లి తర్వాత ఆనందంతో గంతులేయడం మాత్రమే చూస్తున్నాం. కానీ తాజాగా ఓ పెళ్లి కూతురు మాత్రం పెళ్లికి ముందే సంతోషంతో ఉబ్బితబ్బిబై పోతుంది. ఎక్కడలేని ఆనందంతో చిందులు వేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పెళ్లి తంతు జరగడానికి ముందు వధువు సంతోషంతో చిందులు వేస్తుంది. అందుకు కారణం.. తన వద్దకు వెయిటర్ చాక్లెట్స్ కేక్స్ తీసుకురావడం. తన వద్దకు తీసుకువస్తున్న చాక్లెట్స్ కేక్స్ చూస్తూ పెళ్లి కూతురు తెగ సంతోషపడిపోయింది. ఆనందంతో తన వద్దకు తెచ్చిన చాక్లెట్ కేక్ తీసుకుని తింటూ తెగ ఎంజాయ్ చేసింది. ఈ వీడియోను సదరు వధువు మేకప్ ఆర్టిస్ట్ సర్బానీ సేథి ఇన్‏స్టాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 28 వేల మంది వీక్షించారు. పెళ్లి కూతురు ఆనందంతో తెలిపోవడానికి గల కారణం తెలిసి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి..

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Acharya Movie: మరోసారి సెట్స్ పైకి ఆచార్య.. ఊటీ బాట పట్టిన చిరు.. చరణ్.. కారణమేంటంటే..

Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ మడోన్న సెబాస్టియన్ లేటెస్ట్ పిక్స్..

Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..

Akkineni Nagarjuna: ది బేకర్ అండ్ ది బ్యూటీ యూనిట్‏కు నాగార్జున విషెస్.. ఆహాలో ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్..