Viral Video: మిగిలిన చపతీతో వెరైటీ వంటకం వీడియో వైరల్.. 6 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ సొంతం
మిగిలిపోయిన రోటీల రెసిపీ వీడియో సుమారుగా 7 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఇన్ని వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ వంటకం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించలేకపోయింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ రెసిపీని 'అనారోగ్యకరమైనది' అని పేర్కొంటూ పూర్తిగా తిరస్కరించారు. ఇలాంటి వైరల్ వీడియోలు వంటలో వ్యక్తులు ఎంత క్రియేటివ్‌గా ఉంటారో కూడా చూపుతున్నాయి.

రోజు రోజుకీ అనేక రాకల వంటకాలు, ప్రత్యేక, వింత వంటకాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతునే ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని చూసి ప్రజలు షాక్ తింటారు కూడా. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు రుచికి కొత్త రుచిని జోడించే నెపంతో హాస్యాస్పదమైన ప్రయోగాలు చేస్తుంటారు. గులాబీ పకోడాలు, వేప పరాఠాలు వంటి వింత వంటకాలతో పాటు ఇప్పుడు ఒక కొత్త వంటకం వైరల్‌గా మారింది. ఇందులో మిగిలిపోయిన రోటీలతో ఒక స్వీట్ ఫుడ్ ని సిద్ధం చేయడం నేర్పించారు.
మిగిలిపోయిన రోటీల రెసిపీ వీడియో సుమారుగా 7 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఇన్ని వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ వంటకం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించలేకపోయింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ రెసిపీని ‘అనారోగ్యకరమైనది’ అని పేర్కొంటూ పూర్తిగా తిరస్కరించారు. ఇలాంటి వైరల్ వీడియోలు వంటలో వ్యక్తులు ఎంత క్రియేటివ్‌గా ఉంటారో కూడా చూపుతున్నాయి. అయితే మనం చూసేది లేదా తయారు చేసే ఫుడ్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే దానిపై కూడా శ్రద్ధ చూపడం కూడా అంతే ముఖ్యం.
వైరల్ రెసిపీలో రోటీని డీప్ ఫ్రై చేయడం ద్వారా డెజర్ట్ తయారు చేస్తున్నట్లు చూపిస్తుంది. ఇది ఒక వ్యక్తి మిగిలిపోయిన రోటీలను నూనెలో డీప్ ఫ్రై చేయడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి రోటీలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తారు. తర్వాత పాన్‌లో పంచదార పాకం చేసి.. అందులో పాలు పోసి మిక్సి చేసిన చపాతీ పిండిని బాగా కలిపి ఉడికించాడు. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత దానిని బటర్ పేపర్‌తో కప్పిన ట్రేలో పరిచాడు. కొంత సమయం చల్లబరిచినట్లు వీడియోలో చూడవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని బర్ఫీ ఆకారంలో ముక్కలుగా కట్ చేశారు.
మిగిలిపోయిన రోటీ రెసిపీ వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
అయితే ఈ రెసిపీని ప్రయత్నించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఈ వంటకాన్ని తయారు చేయడం కొందరు అనారోగ్యకరమని చెబుతుండగా మరికొందరు ఎక్కువ సమయం వృధా చేయడం కంటే టీలో ముంచి మిగిలిన రోటీలను ఆస్వాదించడమే మంచిదని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..