అదృష్టం వరించింది.. గిరిజన కార్మికుడికి దొరికిన ఖరీదైన వజ్రం.. విలువ తెలిస్తే..
అదృష్టం వరించింది.. గిరిజన కార్మికుడి నిరంతర కష్టం ఫలించింది. ఒక్కసారిగా అతన్ని లక్షాధికారిని చేసింది. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గిరిజన కార్మికుడు మాధవ్‌కి లక్షల విలువైన వజ్రం దొరికింది. కృష్ణ కల్యాణ పట్టి ప్రాంతంలోని ఓ గనిలో పని చేస్తుండగా అతను ఈ వజ్రాన్ని గుర్తించాడు. రూల్స్ ప్రకారం వజ్రాన్ని పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేయగా, త్వరలో వేలం వేయనున్నారు.

దేశంలోని వజ్రాల గనుల పేరు చెప్పగానే మధ్యప్రదేశ్‌లోని పన్నా గుర్తుకొస్తుంది. కానీ, పన్నా దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి నిలయంగా మారింది. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు మాత్రం నిలయంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే నిరంతరం అక్కడ కూలీలు, కార్మికులు వజ్రాల వేట సాగిస్తుంటారు.
అదృష్టం వరించింది.. గిరిజన కార్మికుడి నిరంతర కష్టం ఫలించింది. ఒక్కసారిగా అతన్ని లక్షాధికారిని చేసింది. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గిరిజన కార్మికుడు మాధవ్‌కి సుమారు రూ. 40 లక్షల విలువైన 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. కృష్ణ కల్యాణ పట్టి ప్రాంతంలోని ఓ గనిలో పని చేస్తుండగా అతను ఈ వజ్రాన్ని గుర్తించాడు. రూల్స్ ప్రకారం వజ్రాన్ని పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేయగా, త్వరలో వేలం వేయనున్నారు. దేశంలోని వజ్రాల గనుల పేరు చెప్పగానే మధ్యప్రదేశ్‌లోని పన్నా గుర్తుకొస్తుంది. అక్కడ కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు.
ఇటు, ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో కూడా వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. వర్షాకాలం తొలకరి వాన పడింది మొదలు.. ఇక్కడ వజ్రాల వేట కోసం కూలీలు వాలిపోతుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…




