Viral Video: ఇంట్లో తిష్టవేసిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకునేందుకు లోపలకి వెళ్లిన స్నేక్ క్యాచర్.. చివరకు..

కింగ్ కోబ్రా పాము అకస్మాత్తుగా ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..? సాధారణంగా పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతుంటారు.

Viral Video: ఇంట్లో తిష్టవేసిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకునేందుకు లోపలకి వెళ్లిన స్నేక్ క్యాచర్.. చివరకు..
Viral Video
Follow us

|

Updated on: Jan 14, 2023 | 4:34 PM

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి.. ఈ పాము కాటుకు గురైతే నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి కింగ్ కోబ్రా పాము అకస్మాత్తుగా ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..? సాధారణంగా పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. ఇంకా కొంచెం దూరంలో కనిపిస్తే అక్కడ నుంచి పరుగులు తీస్తారు.. అయితే.. అత్యంత విషపూరితమైన పాము ఇంట్లో తిష్ట వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగిందే. ఇంట్లోకి ప్రవేశించిన భారీ తాచుపాము (కింగ్ కోబ్రా) ఇంట్లోనే తిష్ట వేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ సమాచారం అందించారు. అతను వెంటనే వచ్చి పాము ఎక్కడుందో వెతకడం కొనసాగించాడు. అసలే పూరిల్లు కావడంతో పామును కనుగొనడం సవాలుగా మారింది. చాలా సేపటి తర్వాత గుడిసె పైకి పాకుతున్న పామును గమనించి.. దాని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను.. ఒడిశాకు చెందిన స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ రెండు నెలల క్రితం తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో 5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఈ వీడియోను నెటిజన్లు ఇప్పటివరకు 58 లక్షల కంటే ఎక్కువ సార్లు చూశారు. మీరు ఈ వీడియో ప్రారంభంలో చూస్తే.. ఒక వ్యక్తి గుడిసెలోకి వెళ్లి అక్కడ ఒక మూలలో పైకి చూస్తున్నాడు. అప్పుడు పైన కూర్చున్న కింగ్ కోబ్రా అతనిపై దాడి చేయడానికి సిద్ధమైంది. దాన్ని గమనించిన స్నాక్ క్యాచర్ దాని తోకను పట్టుకుని.. బంధించేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా అతనిపై దాడి చేసేందుకు పలు మార్లు ప్రయత్నించింది.

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

కింగ్ కోబ్రా పట్టుకున్న తరువాత, అతను నెమ్మదిగా దానిని గుడిసెలోంచి బయటకు తీసుకువచ్చి.. ఈ పాము ఎంత పెద్దగా ఉందో అక్కడున్న వారికి చూపించాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత కింగ్ కోబ్రాను పట్టుకుని సంచిలో బంధించి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేయడంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..