AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం

ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. చాగంటి దంపతులు తమ పెంపుడు శునకం "బుజ్జి"కి అచ్చం మనుషుల సీమంతం లాగే ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. గ్రామంలోని ముత్తైదువులను ఆహ్వానించి, సాంప్రదాయ పిండివంటలతో, ఒడినింపి, హారతులిచ్చి పండుగ వాతావరణం సృష్టించారు. తమ పెంపుడు జంతువుపై కుటుంబ సభ్యులు చూపిన అపారమైన ప్రేమ గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
Baby shower function for dog
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 11:38 AM

Share

గర్భంతో ఉన్న మహిళలకు శ్రీమంతం చేయటం మనం తరచూగా చూస్తుంటాం.. ఇది సాధారణమే. కానీ, అదే శ్రీమంతం గర్బంతో ఉన్న కుక్కకు చేస్తే.. అవును, వినటానికి వింతగా అనిపించినప్పటికీ, తమ పెంపుడు కుక్కకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు ఒక దంపతులు. ఈ వింత ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కకు ఓ కుటుంబం శ్రీమంతం నిర్వహించింది. అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుకలు జరిపింది. కుక్కపై తమకున్న ప్రేమను చాటుకుంది. ఈ విచిత్ర సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కిష్టాపురం గ్రామానికి చెందిన చాగంటి పెద్ద నరసింహారావు, అన్నపూర్ణ దంపతులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి సీమంతం చేసిన తీరు పలువురిని ఆకర్షించింది. శునకాన్ని ఇంటి బిడ్డగా ప్రేమిస్తూ…“బుజ్జి ” అని పిలుచుకుంటారు. తమ ఇంటి ఆడబిడ్డకు ఎలా అయితే శుభకార్యం చేస్తారో…అచ్చం అలానే ఘనంగా పెంపుడు శునకం బుజ్జి కి శ్రీమంతం నిర్వహించారు.

సోమవారం గ్రామంలోని ముత్తైదువులను ఆహ్వానించి, సాంప్రదాయబద్ధంగా పిండివంటలు తయారు చేసి, ఒడినింపడం, హారతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అతిధులుగా వచ్చిన ముత్తైదువులకు చీరలు, సారే, పసుపు–కుంకుమలు అందించి సాంప్రదాయ రీతిలో మర్యాదలు చేసి గౌరవించారు. కుటుంబ సభ్యులు తమ పెంపుడు జంతువు శునకం పై చూపిన మమకారం గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది…తన సొంత కూతురు కి చేసినట్లు ఘనంగా ఒక కుక్కకు శ్రీమంతం చేయడం పై స్థానికులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన సినిమా..
ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన సినిమా..
అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం..
అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం..
ఫోన్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా..?
ఫోన్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా..?
మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని మోదీ..
మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని మోదీ..
పోలీస్ జాగిలాల శక్తి ప్రదర్శన..ఈ బ్రీడ్ జాగిలాలు త్వరలో విధుల్లో
పోలీస్ జాగిలాల శక్తి ప్రదర్శన..ఈ బ్రీడ్ జాగిలాలు త్వరలో విధుల్లో
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..
ధైర్యం, ఉత్సాహం మేష రాశి.. మీకు ఏ రాశివారు బాగా కలిసి వస్తారంటే
ధైర్యం, ఉత్సాహం మేష రాశి.. మీకు ఏ రాశివారు బాగా కలిసి వస్తారంటే
హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు..
హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు..
హైదరాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్.. వాహనదారులకు ఊరట
హైదరాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్.. వాహనదారులకు ఊరట