Central Jail :సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవాలి చెట్టేక్కి కూర్చున్న ఖైదీ.. ఆ తర్వాత సీన్ ప్రత్యక్ష ప్రసారం..!
సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పారిపోయే ప్రయత్నం చేశాడు. అందుకోసం జైలు గోడకు సమీపంలో గల ఓ పెద్ద చెట్టు పైకి ఎక్కేశాడు..కానీ, ఆ విషయం అధికారులకు తెలిసింది.
ఒక సెంట్రల్ జైలులో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన హత్యా నేరస్థుడు సమీపంలో ఒక్క పెద్ద చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. కానీ, ప్రయత్నం బెడిసి కొట్టింది. దాంతో నేరస్థుడి ప్రయత్నించి ఫెయిల్ కావటంతో జైల్ సిబ్బంది, అధికారుల వలలో పడ్డాడు.. పైగా ఖైదీ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం, అధికారులు పట్టుకున్న సీన్ మొత్తం స్థానిక ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పారిపోయే ప్రయత్నం చేశాడు. అందుకోసం జైలు గోడకు సమీపంలో గల ఓ పెద్ద చెట్టు పైకి ఎక్కేశాడు..కానీ, ఆ విషయం అధికారులకు తెలిసింది. కొట్టాయంకు చెందిన సుభాష్ సాయంత్రం జైలు గోడ దూకి పక్కనే ఉన్న ప్రభుత్వ కాంపౌండ్‌లో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. విషయం తెలుసుకున్న అధికారులు..చెట్టు కింద సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు. అతడిని కిందికి రావాల్సిందిగా హెచ్చరించారు. కానీ,అతడు ససేమిరా అన్నాడు. ఎంతగా సర్దిచెప్పినా ఖైదీ కిందికి దిగి రాలేదు. దీంతో కొందరు అధికారులే చెట్టుపైకి ఎక్కాలని అనుకున్నారు. కొందరు ఆ ఖైదీ ఎక్కి కూర్చున్న చెట్టు ఎక్కారు. తీరా.. ఆ ఖైదీని పట్టుకోబోయే లోపే అతడు మరో కొమ్మకు దూకాడు. దీంతో తాను కూర్చున్న కొమ్మ విరిగిపోయింది. ఆ తర్వాత ఖైదీ చెట్టు పై నుంచి కింద పడ్డాడు. కానీ, అధికారులు అప్పటికే సేఫ్టీ నెట్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ తతంగమంతా స్థానిక చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది.
కొట్టాయంకు చెందిన సుభాష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో దోషిగా తేలాడు. 2014 నుంచి జైలులో ఉంటున్నాడు. అయితే, ఇటీవలే ఆయనలో మానసిక సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించి సెంట్రల్ జైలుకు పంపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి