AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ కనిపించినవి చూసి స్టన్

కేరళలో ఎంతో ఆశతో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్లకు నిరాశే ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా వారికి జల పుష్పాలు చిక్కలేదు. అయితే నిరాశతో తిరుగు ప్రయాణం ప్రారంభించిన వారికి కొంత ఊరట లభించింది. అదేంటో తెలుసుకుందాం పదండి..

Viral: చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ కనిపించినవి చూసి స్టన్
Kannur Fishermen
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2025 | 3:04 PM

Share

కన్నూరు జిల్లా అజీక్కల్‌కు చెందిన మత్స్యకారులు ఇటీవల అనూహ్యంగా తేలియాడుతున్న కొబ్బరికాయలను సముద్రం నుంచి సేకరించారు.  పైయంబలం తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో త్రీపు చెట్ల అవశేషాలు, ఇతర తుపాను శిధిలాల మధ్య ఇవి కనిపించాయి. ఈ కొబ్బరికాయలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల గుండా సముద్రంలోకి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

గత మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో 25 మంది మత్స్యకారుల బృందం నౌకతో పాటు రెండు చిన్న పడవలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో.. వారు చేపలు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అజీక్కల్ తీరంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వారు కన్నూరు హార్బర్ వైపు ప్రయాణం సాగించారు. ప్రయాణంలో సముద్రంలో గుంపులుగా తేలియాడుతున్న కొబ్బరికాయలను గుర్తించారు. ‘మేము 300 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించాము. ఇవి పూర్తిగా తడి అయ్యి నలుపు రంగులో మారిపోయినా, వాడటానికి అనువుగా ఉన్నాయి’ అని నౌక యజమాని బైజు చెప్పారు.

భారీ వర్షాల కారణంగా నదుల ప్రవాహం సముద్రంలోకి చేరింది. అలా నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్ల నుంచి రాలిన కొబ్బరికాయలు.. నీటి ప్రవాహంలో కలిసి ఇలా సముద్రంలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. వర్షాకాలంలో అజీక్కల్ తీరంలో పడవలు నడపడం కష్టంగా మారుతుంది కాబట్టి.. చాలా మంది జాలర్లు కన్నూరు హార్బర్ నుంచి తమ వేటను కొనసాగిస్తారు.

తీరానికి చేరిన తర్వాత మిగతా మత్స్యకారులు ఈ వివరాన్ని తెలుసుకుని మరికొంత మంది సముద్రంలోకి వెళ్లి 800 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించారు. వాటిని శుభ్రపరిచి అమ్మడం ద్వారా జాలర్లకు కొంత ఆదాయం లభించింది. ‘చేపలు దొరకని రోజుల్లో ఇలా కొబ్బరికాయలను అమ్మడం మాకు కొంత ఉపశమనం ఇచ్చింది’ అని బైజు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..