Viral Video: అయ్యో దేవుడా.. స్నేహితుడి కోసం కొండచిలువతో భీకరంగా పోరాడిన కంగారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించేలా, షాక్‌కు గురి చేసేలా ఉంటాయి..
Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించేలా, షాక్‌కు గురి చేసేలా ఉంటాయి. ప్రపంచంలో చాలా రకాల వింతలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం నమ్మడానికి కష్టంగా ఉండే వీడియోలను సైతం చూస్తుంటాము. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వీడియోల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. సాధారణంగా అడవిలో బలహీనమైన జీవులను వేటాడి తినే శక్తిమంతులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొండ చిలువలు, మొసళ్లు, పులులు వంటి జంతువులు ఇతర వాటిపై దాడులు చేస్తూ ఆహారంగా మార్చుకుంటాయి. గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలానే కనిపించాయి. ఒక జంతువు మరో జంతువును వేటాడినప్పుడు దాని ఇతర జంతువులు ప్రాణాలు కాపాడుకోవాడనికి పరుగులు పెడతాయి. కానీ మీరు చూస్తే వీడియోలో మాత్రం ఒక జంతువును ఓ భారీ కొండ చిలువ దాడి చేస్తుంటే మరో జంతువు తన పరుగెత్తకుండా దానిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటుంది.
View this post on Instagram
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కంగారును కొండ చిలువ చుట్టేసి తీవ్రంగా దాడి చేస్తుంది. ఆ కంగారును చంపేందుకు చేస్తున్న దాడిలో తోటి కంగారు చూసి పరుగెత్తకుండా తోటి కంగారును కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. తోటి కంగారును కాపాడేందుకు ఆ కొండచిలువపై దాడి చేస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు అయిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో స్నేహానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి