Kacha Angoor: ద్రాక్షపండ్లను అమ్మడానికి జింగిల్ పాడిన తాత.. ప్రతిభకు నెటిజన్లు ఫిదా

Kacha Angoor Song: ఇంటర్నెట్(Internet) ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే సెలబ్రెటీగా మార్చగలదు.. లేదా అతడిని వివాదాస్పదుడిగా కూడా చిత్రీకరించగలదు. అయితే సోషల్ మీడియా (Social Media)ఇప్పుడు..

Kacha Angoor: ద్రాక్షపండ్లను అమ్మడానికి జింగిల్ పాడిన తాత.. ప్రతిభకు నెటిజన్లు ఫిదా
Kacha Angoor Song
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2022 | 7:59 AM

Kacha Angoor Song: ఇంటర్నెట్(Internet) ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే సెలబ్రెటీగా మార్చగలదు.. లేదా అతడిని వివాదాస్పదుడిగా కూడా చిత్రీకరించగలదు. అయితే సోషల్ మీడియా (Social Media)ఇప్పుడు ప్రత్యేకమైన ప్రతిభతో పాటు కొన్ని విచిత్రమైన అలవాట్లను ప్రదర్శించడానికి వేదికగా మారింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పనిపై ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు. తాము చేసే పనిలో భిన్నత్వం చూపించి పదిమందిని ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. అలాంటి వ్యక్తులు కొన్ని సార్లు హఠాత్తుగా ఫేమస్ అవుతారు. ‘కచ్చ బాదం'(Kacha Badam), ‘కచ్చా అమ్రూద్’ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ఓ ద్రాక్షపాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తన పండ్లను విక్రయించడానికి  ఒక వృద్ధ జామపండు విక్రేత జింగిల్‌ని ఉపయోగించాడు. ‘కచా బాదం’ ఫేమ్ భుబన్ బద్యాకర్ వలె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. అంతేకాదు.. ఈ తాతగారు పాడిన కచ్చా ద్రాక్ష జింగిల్ ‘కచ్చ బాదం’ కంటే మరింతగా ఆకట్టుకుంది.

ఈ వీడియోలో, ద్రాక్ష ..  ‘చాచా’ పాదచారులను ఆకర్షించడానికి జింగిల్ పాడుతూ కనిపించాడు. ఇంతకుముందు జామపండు అమ్మేందుకు జింగిల్స్‌  పాడుతూ జామపళ్ళు అమ్మేవాడు. ఇప్పుడు ద్రాక్ష అమ్మేందుకు పాడుతూ కనిపించాడు. ఆ వృద్ధుడు ద్రాక్ష పండ్లను అమ్మడం కోసం ఆకట్టుకునే జింగిల్‌ని పాడాడు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 1 లక్షకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వాస్తవానికి యూట్యూబ్, ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో.. భారీ ప్రజాదరణ మాత్రం సలీం ఇనాయత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్  చేసిన తర్వాత దక్కింది.

ఈ ఫన్నీ జింగిల్‌పై నెటిజన్ల స్పందన ఉల్లాసకరమైన ఈ జింగిల్ నెటిజన్‌లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎమోజీలతో తమ సంతోషన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Chanakya Niti: మనిషి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య