Viral News: ఏకంగా 769 రోజులు సెలవులు తీసుకున్న టీచర్.. ఆరా తీయగా ఫ్యూజులు ఔట్!

Viral News: సాధారణంగా ఎక్కువ సెలవులు ఉండే ఉద్యోగాలు ఏవి అని అడిగితే.. అందరి నుంచి ఠక్కున వచ్చే సమాధానం, బ్యాంక్, టీచర్ ఉద్యోగాలు..

Viral News: ఏకంగా 769 రోజులు సెలవులు తీసుకున్న టీచర్.. ఆరా తీయగా ఫ్యూజులు ఔట్!
Teacher
Follow us

|

Updated on: Sep 12, 2021 | 10:26 AM

సాధారణంగా ఎక్కువ సెలవులు ఉండే ఉద్యోగాలు ఏవి అని అడిగితే.. అందరి నుంచి ఠక్కున వచ్చే సమాధానం, బ్యాంక్, టీచర్ ఉద్యోగాలు అని అంటారు. ఈ రెండు ఉద్యోగాలు చాలా సౌకర్యవంతమైనవి. పనితో పాటు సెలవులు కూడా సరి సమానంగా ఉంటాయి. మంచి జీతం, తగినన్ని సెలవులు, ఇతరత్రా సౌకర్యాలు.. ఈ ఉద్యోగాలను ఎవరు కాదంటారు చెప్పండి. అయితే ఇక్కడో ఉపాధ్యాయుడు ఈ సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఏకంగా 769 రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇక అతడు ఎందుకు అన్ని రోజులు సెలవులు తీసుకున్నాడోనని ఆరా తీయగా స్కూల్ యాజమాన్యం ఫ్యూజులు ఔట్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

47 సంవత్సరాల స్కైవింగ్ ఇటలీ పోర్డెనోన్‌లోని పాఠశాలలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం పొందిన మొదటి రోజుల్లో అతడు పిల్లలకు శ్రద్ధగా పాఠాలు బోధించేవాడు. పాఠశాలలో మంచి ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. వివిధ సాకులు చెబుతూ సెలవులు తీసుకోవడం ప్రారంభించాడు. మొదట తనకు హెల్త్ బాగోలేదని కొన్ని రోజులు.. ఆ తర్వాత తన కొడుకును చూసుకోవాలని కొన్ని రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది. సెలవుల సంఖ్య పెరిగింది.. మూడు సంవత్సరాల ఉద్యోగంలో ఏకంగా 769 సెలవులు తీసుకున్నాడు.

కొద్దిరోజులు అతడి ప్రవర్తనను భరించినా.. ఆ తర్వాత విసిగిపోయిన పాఠశాల యాజమాన్యం.. అతడి నుంచి మెడికల్ సర్టిఫికేట్‌ను కోరింది. దానికి అతడు నిరాకరించాడు. చేసేదేమీ లేక ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి పూర్తిగా దర్యాప్తు చేయడంతో షాకింగ్ విషయం బయటికి వచ్చింది.

సెలవు దినాలలో లక్షల సంపాదన..

ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా, టీచర్ ఇతర కంపెనీలలో ఉద్యోగాలు చేసి లక్షల్లో సంపాదించాడు. అతడు కన్సల్టెంట్‌గా పని చేసి.. అనేక కంపెనీలతో ఒప్పందాల కుదుర్చుకుని ఇటలీలోని అనేక ప్రదేశాలను చుట్టు తిరిగాడు. తద్వారా దాదాపు రూ. 83 లక్షలు సంపాదించాడు.

ఇది కాకుండా, అతడు ఫేక్ సెలవుల పేరుతో పాఠశాల నుండి సుమారు రూ. 11 లక్షలకు పైగా క్లెయిమ్ చేశాడు. ప్రస్తుతం, ఈ అంశం కోర్టులో నడుస్తోంది. టీచర్‌కు వచ్చిన జీతం, అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును మొత్తం న్యాయస్థానం జప్తు చేసింది.

Also Read:

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!