Viral News: ఉద్యోగం మానేశాడు.. కానీ 15 ఏళ్లుగా జీతం వస్తోంది.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటాడు. చిన్న జీవనోపాధితో కొంత..

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటాడు. చిన్న జీవనోపాధితో కొంత డబ్బును కూడబెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయితే మీరెప్పుడైనా 15 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లని వ్యక్తి గురించి విన్నారా.? అతను ఉద్యోగం చేయకపోయినా కూడా ప్రతీ నెలా క్రమం తప్పకుండా జీతం వస్తోంది. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగా జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అక్కడి పుగ్లీ సియాసియో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎటువంటి నోటీసు లేదా దరఖాస్తు లేకుండా 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ 15 ఏళ్లు అతడికి జీతం వస్తూనే ఉంది.
15 సంవత్సరాలలో 5.38 లక్షల యూరోలు సంపాదించాడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి 2005వ సంవత్సరంలోనే పని మానేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం మానేసినా.. ఆ తర్వాత నుంచి అతడు జీతం రావడ కొనసాగిందట. ఇలా ఈ 15 సంవత్సరాలలో సదరు వ్యక్తి 5.38 లక్షల యూరోలు (సుమారు 4.8 కోట్ల రూపాయలు) సంపాదించాడని సమాచారం. ఎలాగోలా పోలీసులు మాత్రం చివరికి ఈ తతంగాన్ని నడిపిన నిందితులను మాత్రం పట్టుకోగలిగారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు 2005లో తన మేనేజర్‌ను బెదిరించాడని తెలిసింది. ఆ తర్వాత ఆ మేనేజర్ రిటైర్ కావడం.. ఉద్యోగి గైర్హాజరు కావడం జరిగింది. ఇంకేముంది ఇన్నాళ్లు అలా ఉద్యోగానికి రాకుండానే సదరు ఉద్యోగి జీతాన్ని తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటూ వచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగేసరికి గుట్టంతా బయటపడింది.
