దొంగ కోతి డబ్బులెత్తుకెళ్లింది.!
టోల్ గేట్ల వద్ద జరిగే దొంగతనాల్లో ఇదో కొత్త రకం కోణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని టోల్ గేట్ వద్ద ఓ వింత చోరీ జరిగింది. ఓ కోతి అక్కడి బూత్‌లోకి వెళ్లి ఏకంగా 5 వేలు ఎత్తుకెళ్లింది. ఈ దొంగ కోతిగారి చోరీ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే… ఓ కారు వచ్చి టోల్ గేట్ వద్ద ఆగగానే తక్షణమే అందులో నుంచి ఓ కోతి బయటికి వచ్చి […]

టోల్ గేట్ల వద్ద జరిగే దొంగతనాల్లో ఇదో కొత్త రకం కోణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని టోల్ గేట్ వద్ద ఓ వింత చోరీ జరిగింది. ఓ కోతి అక్కడి బూత్‌లోకి వెళ్లి ఏకంగా 5 వేలు ఎత్తుకెళ్లింది. ఈ దొంగ కోతిగారి చోరీ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే…
ఓ కారు వచ్చి టోల్ గేట్ వద్ద ఆగగానే తక్షణమే అందులో నుంచి ఓ కోతి బయటికి వచ్చి బూత్‌లోకి ప్రవేశించింది. దీనితో బూత్‌లోని క్యాషియర్ తేరుకునే లోగా క్షణాల్లో క్యాష్ కౌంటర్‌లోని కొంత నగదును పట్టుకుని ఉడాయించింది. గతంలో కూడా ఇలాగే ఓ వానరం డబ్బులెత్తుకుపోయిన వైనం మీడియాలో హల్‌చల్ చేసింది. ఇక తాజా సంఘటన విషయానికి వస్తే ఈ కోతిని టోల్ గేట్ సిబ్బంది పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది తాము పెంచుకునే కోతులకు ఇలా దొంగతనాల్లో శిక్షణను ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని టోల్ గేట్ అధికారులు చెబుతున్నారు. ఇదివరలో జరిగిన ఇలాంటి ఘటనను వాళ్ళు గుర్తు చేస్తున్నారు.