AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్స్ తత్తరపడుతూ కనిపించారు – ఆపి చెక్ చేయగా

విమానాశ్రయాల్లో గోల్డ్‌, డ్రగ్స్‌ మాత్రమే కాకుండా, ఇప్పుడు గంజాను స్మగ్లింగ్‌ చేస్తుండటం కలకలం రేపుతోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రోపోనిక్‌ గంజాను భారీగా స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు, అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులు అరెస్ట్‌ అయ్యారు.

Viral: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్స్ తత్తరపడుతూ కనిపించారు - ఆపి చెక్ చేయగా
Airport (Representational Image)
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2025 | 7:17 AM

Share

విమానాశ్రయాలే అడ్డాగా గోల్డ్‌, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమ కార్యకలాపాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు స్మగ్లర్లు. విస్తృత తనిఖీలు, టైట్‌ సెక్యూరిటీతో ఎక్కడికక్కడ కంట్రోల్‌ చేస్తున్నా.. కొత్తకొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి ముఠా. ఇప్పటివరకూ గోల్డ్‌, డ్రగ్స్‌ మాత్రమే అనుకుంటే ఇప్పుడు గంజాను కూడా విమానాల్లో స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పెద్దఎత్తున హైడ్రోపోనిక్‌ గంజాను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయుల నుంచి భారీగా హైడ్రోపోనిక్‌ గంజాను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో చెక్‌-ఇన్‌ బ్యాగులను తనిఖీ చేయగా కవర్లలో దాచిన పలు వాక్యూమ్‌ ప్యాకెట్లను గుర్తించారు.

ఆ ప్యాకెట్లలో ఆకుపచ్చ పదార్థాన్ని గుర్తించి పరిశీలిచంగా అది హైడ్రోపోనిక్‌ గంజాగా తేలింది. సుమారు 12 కేజీల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 1985 ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద ఇద్దరినీ అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ స్మగ్లింగ్‌ వెనక పెద్ద డ్రగ్‌ సిండికేట్‌ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో, డ్రగ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు పోలీసులు. ఇప్పటివరకూ గోల్డ్‌, డ్రగ్స్‌నే స్మగ్లింగ్‌ చేసినా ముఠాలు.. ఇప్పుడు హైడ్రోపోనిక్‌ గంజాను కూడా అక్రమంగా తీసుకొస్తుండటంతో ఇటు కస్టమ్స్‌ అధికారులు.. అటు యాంటీ డ్రగ్‌ టీమ్‌ అలర్ట్ అయ్యాయి. మాదక ద్రవ్యాల గ్యాంగ్స్‌పై మరింత నిఘా పెంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్