Hyderabad City police: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఎక్కువగా వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఘటనల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్లే వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల నిత్యం చాలామంది మరణిస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యత గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి కుటుంబాలను విషాదంలో మునిగేలా చేస్తున్నారు. తాజాగా హెల్మెట్ ప్రాముఖ్యత గురించి తెలంగాణ హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ వీడియోను ట్విట్ చేశారు. జీవితం చాలా విలువైనది, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి.. అంటూ సందేశాత్మక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో ద్విచక్రవాహనదారులు చేసే తప్పులను ఎత్తిచూపుతూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండంటూ అంటూ వాహనదారులకు సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ పెట్టుకుని పాపతో ఉంటాడు. దీనిలో ద్విచక్రవాహనదారులు సాధారణంగా చేసే తప్పుల గురించి చెప్పి హెల్మెట్ ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు. రాజ్యాంగంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులుంటే.. మనం హక్కులను కొన్ని సొంతంగా రాసుకున్నాం..
1. పాల ప్యాకెట్‌కు రోడ్డు చివరి వరకేగా వెళ్లేది హెల్మెట్ అవసరం లేదు.
2. పార్టీలకు డబ్బు ఖర్చు పెడతాం కానీ.. తక్కువ ధరకు హెల్మెట్ కొనాలి.
3. జుట్టు ఊడిపోతుంది కావున హెల్మెట్ పెట్టుకోకూడదు.
4.హెల్మెట్ కొనుక్కోవాలి కానీ.. బండి ట్యాంకు మీద పెట్టి స్టైలిగ్‌గా ఉంచాలి.. తలకు పెట్టుకోకూడదు.
5. పోలీసులు లేరు కావున హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
6. మనం హెల్మెట్ కొనుక్కుంటే చాలు.. పిల్లలకు అవసరం లేదు.
7. హెల్మెట్ పెట్టుకోవాలంటూ ఎవరైనా చెబితే వారంతా ముర్ఖుడు ఎవరూ లేరు.. ఇదండి మన సమాజం అంటూ సందేశంలో పేర్కొంటాడు. ఇలాంటివి పక్కకు పెట్టి.. ఇప్పటికైనా హెల్మెట్ పెట్టుకోవాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన ట్విట్ ..
Life is Precious, Wear Helmet, Be Safe… https://t.co/KtKMg410h4
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 6, 2021
Also Read: