AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడా.. లాటరీ తగిలితే మాత్రం ఇలా మారిపోవాలా? రాత్రికి రాత్రే భర్తను మార్చేసిన మహిళ

ఎవరికైనా లాటరీ తగిలితే వాళ్ల కుటుంబ సభ్యులు పండుగ చేసుకుంటారు. కానీ థాయ్ లాండ్ లోని ఓ మహిళలాటరీ గెలుచుకుంటే తన భర్తకు తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కలకలం రేపింది.

దేవుడా.. లాటరీ తగిలితే మాత్రం ఇలా మారిపోవాలా? రాత్రికి రాత్రే భర్తను మార్చేసిన మహిళ
Wife And Husband
Aravind B
|

Updated on: Mar 22, 2023 | 9:59 AM

Share

ఎవరికైనా లాటరీ తగిలితే వాళ్ల కుటుంబ సభ్యులు పండుగ చేసుకుంటారు. కానీ థాయ్ లాండ్ లోని ఓ మహిళలాటరీ గెలుచుకుంటే తన భర్తకు తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే థాయ్ లాండ్ లోని నారీన్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి ఉండేవాడు. అయితే అతనికి అప్పులు 20 లక్షల రూపాయల వరకు అప్పులయ్యాయి. ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించిన నారిన్, అతని భార్య చావీవాన్ తమ పిల్లలతో కలిసి దక్షిణ కొరియాకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 2014లో అక్కడికి వెళ్లి పనిచేయడం ప్రారంభించారు.అయితే నారిన్ భార్య తమ పిల్లలను చూసుకునేందుకు థాయ్ లాండ్ కు తిరిగివచ్చేసింది. కానీ నారిన్ సౌత్ కొరియాలోనే పని చేస్తూ నెలకు రూ.70 వేలకు పైగా ఇంటికి పంపుతున్నాడు.

ఇటీవల నారిన్ భార్య 2.9 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది. కానీ ఈ విషయం తన భర్తకు తెలియకుండా దాచిపెట్టింది. ఆ తర్వాత ఎలాగోలా నారిన్ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మార్చి 3 న థాయ్ లాండ్ కి రావాలనుకున్నాడు. అయితే నారిన్ థాయ్ లాండ్ చేరుకోగానే తన భార్య ఫిబ్రవరి 25న ఓ పోలీసు అధికారిని పెళ్లి చేసుకుందని తెలుసుకుని కంగుతిన్నాడు. తన భార్య ఇలా చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానని… 20 ఏళ్ల వైవాహిక జీవితంలో తన భార్య ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతినెల తన ఇంటికి డబ్బులు పంపించడం వల్ల ప్రస్తుతం తన ఖాతాలో రూ.1.40 లక్షల మాత్రమే ఉన్నాయని వాపోయాడు. దీంతో నారిన్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని.. ఆ లాటరీ డబ్బులు తీసుకునేందుకు తనకు కూడా అర్హత ఉందని తెలిపాడు .అయితే పోలీసుల విచారణలో నారిన్ భార్య చవీవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను లాటరీ గెలవకముందే కొన్నేళ్ల క్రితం నారిన్ తో విడిపోయానని..అందుకే తన ప్రియుడ్ని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. కానీ నారిన్ మాత్రం ఆమె తన నుంచి విడిపోయిందన్న విషయమే తెలియదని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..