బాబోయ్‌ ప్రాణాంతక డెంగ్యూ..! ఒక వ్యక్తిని ఎన్ని సార్లు ఎటాక్‌ చేస్తుందో తెలుసా..?

|

Sep 04, 2024 | 2:16 PM

రాత్రి పడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తపడాలి. నీరు ఎక్కడ నిలిచిపోయి ఉంటుందో అక్కడే డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. డెంగ్యూ వచ్చి తగ్గాక నిరంతరంగా అలసటగా అనిపించినా, కండరాల నొప్పి పెడుతున్నా, కీళ్ల నొప్పులుగా ఉన్న వెంటనే చెక్ చేయించుకోవాలి.

బాబోయ్‌ ప్రాణాంతక డెంగ్యూ..! ఒక వ్యక్తిని ఎన్ని సార్లు ఎటాక్‌ చేస్తుందో తెలుసా..?
Dengue
Follow us on

డెంగ్యూ ఇది ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది దోమ కాటు వల్ల వస్తుంది. గత కొద్ది రోజులుగా డెంగ్యూ కేసులు పెరుగుతు న్నాయి. కర్ణాటకలో డెంగ్యూని మహమ్మారిగా ప్రకటించింది ప్రభుత్వం. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో డెంగ్యూ అంటువ్యాధిగా మారి వ్యాపిస్తోంది. సాధారణంగా డెంగ్యూ కొద్ది రోజుల్లోనే నయమవుతుంది. కానీ, కొంతమందిలో డెంగ్యూ కారణంగా శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. అయితే, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు డెంగ్యూ బారిపడే అవకాశం ఉంటుందో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా సగటున 400 మిలియన్లు, భారత దేశవ్యాప్తంగా 2.5 లక్షల వరకు డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తుల్లో తొలుత పెద్దగా లక్షణాలు కనిపించవు. ఆ తరువాత అధిక జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రటి మచ్చలు, లేదా రక్తస్రావం, వాంతులు, వికారం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు. అయినప్పటికీ, తీవ్రమైన డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తుల్లో రక్తస్రావం ఉండదు. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం, షాక్, మరణానికి కూడా దారితీయవచ్చు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నాలుగు సార్లు డెంగ్యూ బారిన పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, డెంగ్యూ ఎంత తరచుగా వస్తుందో కూడా తెలుసుకోవటం ముఖ్యం.

డెంగ్యూలో నాలుగు రకాలు ఉన్నాయని వైద్యులు వివరించారు. వాటినిD1, D2, D3, D4గా విభజించారు. వీటిలో ఒక వ్యక్తికి జీవితకాలంలో ఏదో ఒకసారి ఈ నాలుగు రకాలు సోకవచ్చు. డెంగ్యూ ఇందులో D2 డెంగ్యూ అనేది ఎక్కువ ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి. దీంతో ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. డెంగ్యూ నివారణకు పరిశుభ్రత పాటించాలన్నారు. రాత్రి పడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తపడాలి. నీరు ఎక్కడ నిలిచిపోయి ఉంటుందో అక్కడే డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. డెంగ్యూ వచ్చి తగ్గాక నిరంతరంగా అలసటగా అనిపించినా, కండరాల నొప్పి పెడుతున్నా, కీళ్ల నొప్పులుగా ఉన్న వెంటనే చెక్ చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..