విషాదం..నిలబడిన చోటే కుప్పకూలి మరణించిన హోంగార్డు.. భయానక వీడియో వైరల్‌

|

Jul 09, 2024 | 3:19 PM

క్షణాల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న ప్రజలు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం హోంగార్డు గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. దాంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విషాదం..నిలబడిన చోటే కుప్పకూలి మరణించిన హోంగార్డు.. భయానక వీడియో వైరల్‌
Guard Dies By Heart Attack
Follow us on

ఆకస్మిక మరణాలకు సంబంధించిన అనేక భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని కొందరంటే.. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల ఫలితమే ఇది అని మరికొందరు చెబుతున్నారు. రాజస్థాన్ నుండి అలాంటి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందులో ఒక హోంగార్డు ఉన్నట్టుండి నిలువునా కుప్పకూలి మరణించాడు. అతని మరణానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్‌ వీడియో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందినదిగా తెలిసింది. అక్కడి పోలీస్ స్టేషన్ సమీపంలో హోంగార్డు నిలబడి ఉండగా, అతను సడెన్‌గా కింద పడిపోయాడు. కొన్ని క్షణాలు అతడు నొప్పితో అల్లాడి మరణించాడు. అప్పుడు అతని నోటి వెంట రక్తం వచ్చినట్టుగా తెలిసింది. హోంగార్డు మృతి చెందిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం, హోంగార్డు పేరు హరిరామ్ గుర్జార్. అతని వయస్సు 35 సంవత్సరాలు. అతను డిటిహెచ్ కనెక్షన్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. జూలై 5న కచారి రోడ్డులో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంక్‌ సమీపంలో నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న ప్రజలు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం హోంగార్డు గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. దాంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి విషాద సంఘటనలు ఇంకెంత కాలం జరుగుతాయి..? ఇంకెందరి ప్రాణాలు ఇలా నిలువునా కూలిపోతాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇదంతా చోద్యం చూస్తూ ఊరుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూస్తుంటే భయం వేస్తోందని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలకు నిజంగా వ్యాక్సిన్ కారణమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..