Viral Video: స్నేహమంటే ఇదేరా..! కష్టంలో ఉన్న ఫ్రెండ్‌ని ఆదుకున్న తాబేళ్లు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

May 28, 2022 | 1:59 PM

తాబేళ్లకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Viral Video: స్నేహమంటే ఇదేరా..! కష్టంలో ఉన్న ఫ్రెండ్‌ని ఆదుకున్న తాబేళ్లు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Viral Video
Follow us on

Turtles helping friend Video: భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవుల్లో తాబేళ్లు ఒకటి. తాబేళ్లల్లో పలు రకాలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 150 నుంచి 200 ఏళ్లపాటు జీవిస్తాయి. ఇవి చాలా నెమ్మదిగా కదిలే జీవులు. తాబేళ్లు సాధారణంగా గంటకు 270 మీటర్ల వేగంతోనే నడుస్తాయి.. అంటే రోజంతా నడిచినా 6.4 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాయి. అయితే.. తాబేళ్లకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ రోజుల్లో అలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. వాస్తవానికి ఇందులో ఒక తాబేలు కష్టాల్లో కూరుకుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కష్టం నుంచి బయటపడలేకపోయింది. ఈ సమయంలో ఆ తాబేలును చూసి దాని ‘స్నేహితులు’ ఊహించని రీతిలో సహాయం చేసి ప్రాణాలను కాపాడాయి.

భూమిపై లేదా నీటిలో ఉన్న తాబేళ్లు.. వెల్లకిలా పడితే.. తమను తాము మళ్లీ నిటారుగా చేసుకోవడం కష్టంగా మారుతుంది. వైరల్ వీడియోలో కూడా అలాంటిదే కనిపిస్తుంది. నీటిలో ఉన్న ఒక తాబేలు తలకిందులుగా పడుతుంది. సరైన దిశలోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ దాని ప్రయత్నాలు ఫలించవు. ఇదే సమయంలో స్నేహితుడు ప్రమాదంలో ఉండటాన్ని చూసిన మిగతా తాబేళ్లు.. దానికి సాయం చేసేందుకు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అనంతరం తాబేళ్లన్నీ సమూహంగా ఏర్పడి.. తాబేలును ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కాపాడతాయి. అయితే.. ఈ వీడియో చూసిన వారంతా.. స్నేహమంటే ఇదేరా అంటూ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

హృదయాన్ని హత్తుకునే ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో sejal_moga అనే యూజర్ షేర్ చేయగా.. దీనిని ఇప్పటివరకు 8.9 మిలియన్ల మంది వీక్షించారు. దీంతోపాటు 7 లక్షల మందికి పైగా ప్రజలు లైక్ చేసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. జంతువులను చూసైనా మనుషులు నేర్చుకోవాలని.. అసలైన స్నేహానికి ఈ తాబేళ్లు నిదర్శనం అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..