Nandamuri Balakrishna: అనుభవిస్తున్నారు.. ఆత్మ విమర్శ చేసుకోండి.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు.. ఆత్మవిమర్శ చేసుకోవాలి.. అంటూ బాలకృష్ణ ఏపీ ప్రజలకు సూచించారు.
Nandamuri Balakrishna on YSRCP: వైసీపీ ప్రభుత్వం గుడిని.. గుడిలో లింగాన్ని మింగేసే రకం అని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గియ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో (NTR Jayanthi) భాగంగా నందమూరి బలాకృష్ణ తెనాలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు.. ఆత్మవిమర్శ చేసుకోవాలి.. అంటూ బాలకృష్ణ ఏపీ ప్రజలకు సూచించారు. ప్రజలు ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఓటు అంటే నోటు కాదని తెలుసుకోవాలని బాలయ్య ప్రజలకు సూచించారు. ఓటును సవ్యంగా వేస్తేనే బడి.. గుడి రెండూ ప్రజలకు చేరువలో ఉంటాయన్నారు.
భావోద్వేగానికి గురైన బాలయ్య
తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలక్రిష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు.
కాగా.. శత జయంతోత్సవాల్లో భాగంగా నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..