లక్ అంటే ఇదే..ప్రాణాలు కాపాడిన యాక్సిడెంట్..మీరు చూడాల్సిందే..!

సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే..ప్రాణాలు పోవడమో, గాయలవ్వడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఓ రోడ్డు ప్రమాదం ప్రాణాలను కాపాడటం మీరు ఎప్పుడైనా చూశారా..? యస్..ఇప్పుడు మీకు ఆ విజువల్స్ చూపించబోతున్నాం. అమెరికాలోని ఆరిజోనా రాజధాని ఫీనిక్స్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ జంట తమ చిన్నారిని ట్రోలర్‌లో కూర్చొబెట్టుకుని నాలుగు రోడ్లుగల సర్కిల్‌లో రోడ్డును దాటుతున్నారు. ఓ మార్గంలో రెడ్‌ సిగ్నల్‌ పడటం కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో వీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:38 pm, Fri, 25 October 19
లక్ అంటే ఇదే..ప్రాణాలు కాపాడిన యాక్సిడెంట్..మీరు చూడాల్సిందే..!

సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే..ప్రాణాలు పోవడమో, గాయలవ్వడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఓ రోడ్డు ప్రమాదం ప్రాణాలను కాపాడటం మీరు ఎప్పుడైనా చూశారా..? యస్..ఇప్పుడు మీకు ఆ విజువల్స్ చూపించబోతున్నాం.

అమెరికాలోని ఆరిజోనా రాజధాని ఫీనిక్స్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ జంట తమ చిన్నారిని ట్రోలర్‌లో కూర్చొబెట్టుకుని నాలుగు రోడ్లుగల సర్కిల్‌లో రోడ్డును దాటుతున్నారు. ఓ మార్గంలో రెడ్‌ సిగ్నల్‌ పడటం కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో వీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ జీపు అతి వేగంతో ప్రయాణిస్తూ రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటి వారిని ఢీకొట్టబోయింది. కాగా అదే సమయంలో వేరే మార్గంలో దైవంలా వచ్చిన మరో వాహనం ఆ జీపును ఢీకొట్టింది. దీంతో రెప్పపాటులో దంపతులు వారి చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలాగే రెండు కార్లలో ఉన్నవారికి పెద్ద గాయాలేమీ కాలేదు. జంటను ఢీకొట్టడానికి వెళ్లిన కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫీనిక్స్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తమ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలపై వీడియోను పోస్ట్‌ చేసింది.

https://www.facebook.com/phoenixazpolice/videos/1368164593340876/?t=0