AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతని కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ

మీరు…తాగకపోయినా..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడైనా పట్టుబడ్డారా..? మీకు డ్రింకింగ్ అలవాటు లేకపోయినా మత్తుగా ఫీల్ అవుతున్నారా..? అయితే మీరు వెంటనే వెళ్లి డాక్టర్‌ను కలవండి. బహుశా మీ కడుపులో బీరు తయారవుతూ ఉండొచ్చు. ఏంటంటి మేము చెప్పేది కామెడీగా అనిపిస్తుందా..? కానీ ఇది సీరియస్ విషయం. న్యూయార్క్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. మాములుగా కాదు లిమిట్ కంటే 5 టైమ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నాడని మెషీన్ చెప్పడంతో..సదరు వ్యక్తిని స్టేషన్‌కు […]

అతని కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ
Ram Naramaneni
|

Updated on: Oct 25, 2019 | 5:17 PM

Share
మీరు…తాగకపోయినా..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడైనా పట్టుబడ్డారా..? మీకు డ్రింకింగ్ అలవాటు లేకపోయినా మత్తుగా ఫీల్ అవుతున్నారా..? అయితే మీరు వెంటనే వెళ్లి డాక్టర్‌ను కలవండి. బహుశా మీ కడుపులో బీరు తయారవుతూ ఉండొచ్చు. ఏంటంటి మేము చెప్పేది కామెడీగా అనిపిస్తుందా..? కానీ ఇది సీరియస్ విషయం.
న్యూయార్క్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. మాములుగా కాదు లిమిట్ కంటే 5 టైమ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నాడని మెషీన్ చెప్పడంతో..సదరు వ్యక్తిని స్టేషన్‌కు తరలించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి..ఫైన్ వేశారు. కానీ పోలీసులు ముందు తాను మద్యం సేవించలేదని..తనను నమ్మమని అతడు వేడుకున్నాడు. అందరూ చెప్పే విషయమేగా అని పోలీసులు కూాడా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. అలా అతడు  2014 నుంచి పదే పదే పట్టుబడుతూనే ఉన్నాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రతిసారీ తాను తాగలేదు మొర్రో అని చెప్పినా  ఖాకీలు వినలేదు.
ఈ మిస్టరీ ఏంటో తేల్చుకోవాలని అతడు 2017లో ఓ డాక్టరును కన్సల్ట్ అయ్యాడు. తాను పడుతోన్న ఇబ్బందిని చెప్పుకున్నాడు. చెక్ చేసిన డాక్టర్లకి దిమ్మతిరిగిపోయే న్యూస్ తెలిసింది.  బాధితుడి కడుపులో ప్రతిరోజు బీర్‌ తయారవటమే దీనికి కారణం. ఇలా నిత్యం కడుపులో బీర్ తయారవుతుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అతడు పోలీసులకు చిక్కేవాడు. అంతేకాదు అతడికి రోజంతా మత్తుగా ఉండేదట. అతడి విచిత్ర పరిస్థితికి కారణం ఓ ఫంగస్. 2011లో అతడికి చిన్నపాటి గాయం అవడంతో అతడు కొన్ని యాంటీబయాటిక్‌ వేసుకున్నాడు. దీన్ని ప్రభావం కారణం అతడి పొట్టలోకి సకారోమైసెస్ సర్వేసీ అనే ఫంగస్ అభివృద్ధి చెందింది. అతడు తిన్న ఆహారాన్ని ఈ ఫంగస్ బీరు కింద మార్చేసేది. దీంతో అతడు డ్రంకన్ డ్రైవ్‌లో తరచూ దొరికిపోయేవాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే..బీరు తయారికి అదే ఫంగస్ వినియోగిస్తారు. ప్రస్తుతం అతడు ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాడు. కాగా ఇది చాలా అరుదైన డిసీజ్ అని..గత 30 ఏళ్లలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ వ్యాధితో బాధపడ్డారని డాక్టర్లు తెలిపారు.

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..