Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..! కూపీ లాగితే తేలింది..?

ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏక్తాగుప్తా చనిపోవటంతో విమల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మూడో కంటపడకుండా శవాన్ని మాయం చేయాలి అనుకున్నాడు. జిమ్‌ ట్రైనర్‌ విమల్ సోనీ చేసిన ఈ దారుణం గత నాలుగు నెలలపాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..! కూపీ లాగితే తేలింది..?
Gym trainer kills woman in Kanpur
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2024 | 4:07 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. కాన్పూర్‌కు చెందిన ఓ మహిళ కనిపించటం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధిత మహిళ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు మొదలుపెట్టారు. మహిళ కోసం ఆరా తీసిన పోలీసులకు షాకింగ్‌ విషయం తెలిసింది. ఆమె తరచూవెళ్లే జిమ్ ట్రైనర్ మహిళను చంపి, మృతదేహాన్ని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో పూడ్చిపెట్టినట్టుగా గుర్తించారు. జిమ్ ట్రైనర్‌ విమల్ సోనీని పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాన్పూర్‌కు చెందిన ఏక్తా గుప్తా అనే మహిళ కనిపించడం లేదని భర్త రాహుల్ ఫోలీస్‌ స్టేషన్‌లో కంప్లైట్‌ ఇచ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. ఏక్తా గుప్తాకు విమల్ అనే జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా విచారణలో తేలినట్టుగా పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే జిమ్‌ ట్రైన్‌ విమల్ మరో మహిళతో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఏక్తా గుప్తా అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో విమల్ ఏక్తా మెడపై బలంగా కొట్టాడంతో ఆమె మరణించినట్టుగా పోలీసుల విచారణలో తేలిందని చెప్పారు. ఇక చనిపోయిన ఏక్తాగుప్తా మృతదేహాన్ని దృశ్యం సినిమా తరహాలో ఖననం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏక్తాగుప్తా చనిపోవటంతో విమల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మూడో కంటపడకుండా శవాన్ని మాయం చేయాలి అనుకున్నాడు. పథకం ప్రకారం..శవాన్ని కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. విమల్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు మొత్తం విషయాన్ని బయటపెట్టారు. ఏక్తా గుప్తా శవాన్ని గుర్తించారు. జిమ్‌ ట్రైనర్‌ విమల్ సోనీ చేసిన ఈ దారుణం గత నాలుగు నెలలపాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?