సోషల్ మీడియాలో హీరోయిన్స్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటేస్ట్ ఫోటోస్.. చిట్ చాట్స్ అంటూ ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటారు. ఇక ఇంట్రెస్టింగ్ పిక్స్.. చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కన్ప్యూజ్ చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ సంతోషంలో మునిగితేలుతున్న ఫోటో షేర్ చేస్తూ ఫేక్ ఆప్టర్ నూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పైన ఫోటోను చూశారు కదా. ఆనందంలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలే కాకుండా.. ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంపై సత్తా చాటుతోంది ఎవరో గుర్తుపట్టండి.
ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. టాలీవుడ్ ముద్దగుమ్మ రెజీనా కసాండ్రా. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన శృతి మనసులో శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత రోటిన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రెజీనా అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ లోనూ అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ప్రస్తుతం శాకిని డాకిని సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.