జీవితంలో అత్యంత ప్రత్యేకం వివాహం. తమ పెళ్లి గురించి యువతీయువకులే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో కలలు కంటారు. బంధువులు, స్నేహితుల మధ్య వైభవంగా వివాహం జరగాలని కోరుకుంటారు. ఇక మరికొందరు తమ పెళ్లి వేడుక సరికొత్తగా ఉండాలని.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని సన్నివేశాలు జరగాలనుకుంటారు. అలాగే తమ కాబోయే భార్యకు బహుమతులు ఇవ్వాలని. తన భర్తకు కొత్తగా సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుంటారు. ఇటీవల వధూవరులు కానుకలు ఇచ్చుకుంటున్న.. ప్రపోజ్ చేసుకుంటున్న వీడియోస్ చాలానే చూసి ఉంటాం. కానీ ఇక్కడ వరుడు చేసిన పని చూసి వధువు ముగ్దురాలయ్యింది. ఆమె రియాక్షన్ చూసి వరుడు సైతం సిగ్గుతో మురిసిపోయాడు. వారిద్దరి పెళ్లి వేడుక ఎంతో సంతోషంగా.. సరదాగా జరిగింది. వధూవరుల అన్యోన్యతను చూసి బంధువులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆ పెళ్లి వేడుకలో వధువు రాగానే.. తన బంధువులు, స్నేహితులతో కలిసి ఎంతో అందంగా డ్యాన్స్ చేశాడు. అద్భుతంగా నృత్యం చేస్తూ వధువుకు ప్రపోజ్ చేశాడు. వరుడు అందంగా ప్రపోజ్ చేయడం చూసి ఫిదా అయ్యింది పెళ్లి కూతురు. తన మనసులోని మాటలను కేవలం డ్యాన్స్ ద్వారా తెలియజేశాడు. అతనికి మద్దతుగా తన స్నేహితులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని సాజన్ జీ ఘర్ ఆయే పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో చిరునవ్వుతో వరుడి ముందు నిలబడిపోయింది. . ఆమె రియాక్షన్ చూసిన వరుడు సిగ్గుతో మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక వీడియో చూసిన నెటిజన్స్ సైతం కామెంట్స్ రూపంలో తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి