AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..

పిల్లలకు పుట్టినప్పటి నుంచే టీకాలు వేయించాలి. వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి రకరకాల ఇంజెక్షన్లు అవసరం. ఈ ఇంజెక్షన్లు నొప్పిని కూడా కలిగిస్తాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్లను కరిగేలా, తాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగంపై పనిచేస్తోంది. ఇది విజయవంతమైతే, ప్రజలు తమ ఇంజెక్షన్లను కాఫీలాగా తాగేస్తారు. తాజా పరిశోధన సంచలనం సృష్టిస్తోంది.

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..
Drinkable Flu Vaccine
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2026 | 7:35 AM

Share

పిల్లలకు పుట్టినప్పటి నుంచే టీకాలు వేయించాలి. వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి రకరకాల ఇంజెక్షన్లు అవసరం. ఈ ఇంజెక్షన్లు నొప్పిని కూడా కలిగిస్తాయి. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్లను కరిగేలా, తాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగంపై పనిచేస్తోంది. ఇది విజయవంతమైతే, ప్రజలు తమ ఇంజెక్షన్లను కాఫీలాగా తాగేస్తారు. ఈ తాజా పరిశోధన సంచలనం సృష్టిస్తోంది.

ప్రతి ఏటా మారే ఫ్లూ వైరస్‌ల నుంచి రక్షణ పొందేందుకు సూది మందుల ద్వారా టీకాలు తీసుకోవడం సాధారణమే. అయితే, ఇకపై ఇంజెక్షన్ అవసరం లేకుండా తాగే ద్రవ రూపంలో ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకులు బేకర్స్ ఈస్ట్ ఉపయోగించి విప్లవాత్మక యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. గత 80 ఏళ్లుగా ఫ్లూ వ్యాక్సిన్ తయారీకి కోడి గుడ్లను ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వ్యాక్సిన్ తయారు చేయడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. కానీ, మిచిగాన్ ఇంజినీరింగ్ బృందం సాధారణ బేకింగ్ ఈస్ట్ ఉపయోగించి కేవలం ఒక నెల రోజుల్లోనే భారీ మొత్తంలో టీకాను ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొంది.

ఈ విప్లవాత్మక ప్రయోగం ద్వారా తయారీ సమయం బాగా తగ్గింది. 6 నెలల నుండి 1 నెలకు తగ్గింది. వైరస్ జన్యు పదార్థం ఉండదు. కాబట్టి, ఇన్ఫెక్షన్ ముప్పు ఉండదు. సాధారణ ఫ్లూ టీకాలు ప్రతి ఏటా ఉత్పరివర్తనం చెందే హెమాగ్లుటినిన్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ, పరిశోధకులు ఏళ్ల తరబడి రూపాంతరం చెందని, స్థిరంగా ఉండే ఎం2 ప్రొటీన్ పై దృష్టి సారించారు. ఈస్ట్ ద్వారా ఎం2 ప్రొటీన్ పూత కలిగిన వైరస్-లాంటి కణాలను సృష్టించారు.

ఇవి కూడా చదవండి

ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ 3 వేర్వేరు ఫ్లూ రకాల పై 100శాతం ప్రభావవంతమైన రక్షణను చూపించింది. ఈ సాంకేతికతను నోటి ద్వారా తీసుకునే టీకాగా మలచడానికి మిచిగాన్ యూనివర్సిటీ ప్రైవేట్ సంస్థ ఎస్పెరోవాక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో ఈ పరిశోధన మానవ ప్రయోగాల్లో విజయవంతమైతే, సూది మందుల భయం లేకుండా గుక్కెడు ద్రవంతో ఫ్లూ నుంచి జీవితకాల రక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us