బంగారంలా మెరిసిపోతున్న చెట్టు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఇంతకీ ఎక్కడంటే.!

సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే బస్సుల్లోనూ, ట్రైన్స్‌లోనూ అలాగే విమానాల్లో సీట్లను ముందే రిజర్వేషన్ చేసుకుంటాం. ఇది కామన్‌..

బంగారంలా మెరిసిపోతున్న చెట్టు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఇంతకీ ఎక్కడంటే.!
Tree
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 02, 2021 | 2:43 PM

సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే బస్సుల్లోనూ, ట్రైన్స్‌లోనూ అలాగే విమానాల్లో సీట్లను ముందే రిజర్వేషన్ చేసుకుంటాం. ఇది కామన్‌.. కానీ ఓ చెట్టును చూడ్డానికి కూడా ముందే రిజర్వేషన్ చేయించుకోవాలనే సంగతి మీకు తెలుసా? అవును ఈ బంగారం లాంటి చెట్టును చూడాలంటే రిజర్వేషన్‌ తప్పనిసరి. ఇంతకీ ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

బంగారంలో మెరిసిపోతోన్న ఈ చెట్టు చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలోని జోంగునాన్ కొండల్లో ఉంది. అద్బుతమైన అందం ఈ చెట్టు సొంతం. బంగారంలా పసుపు పచ్చగా మెరిసిపోతూ ఉన్న ఈ చెట్టు వయసు 1400 సంవత్సరాలు. అన్నీ కాలాల్లో ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు.. శరత్కాలంలో మాత్రం మొత్తం బంగారు రంగులోకి మారిపోతుంది. అక్కడి ప్రదేశంలో రాలిన ఆకులను, చెట్టుపై ఉన్న ఆకులను చూస్తుంటే..ఎక్కడో మరో అందమైన ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది.

కళ్లు తిప్పుకోనివ్వని అందం దీని సొంతం. ఇది చెట్టా? లేదా బంగారమా? అనిపిస్తుంది. అత్యంత సుందరంగా కనిపించే ఈ చెట్టుని చూడటానికి జనం భారీగా సంఖ్యలో వస్తుంటారు. అక్కడ చెట్టు నుంచి రాలిపడ్డ ఆకుల్ని చూసిన ప్రతిఒక్కరికీ ఇవి ఆకులా? లేక బంగారు రేకులా? అనే డౌట్‌ కచ్చితంగా వస్తుంది. ఈ చెట్టును చూడాలంటే క్యూలో నాలుగైదు గంటలైనా నిలబడాల్సిందే. అందుకే ఈ చెట్టును చూడాలనుకునే వారు ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!