Viral Video: ఓరీ దీని వేషాలో..సోకులకేమి తక్కువ లేదు..ఈశునుకాన్ని చూస్తే దిమ్మతిరగాల్సిందే..
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఓ శునకం పేపర్ చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా.. మనుషులే కాదు..కుక్కలు కూడా పేపర్ చదవగలవా అంటూ అవాక్కవుతున్నారు.
Viral News: మన చట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పేపర్ చదువుతాం.. కాని జంతువులు తన కళ్లతో చూడటం తప్పా..పుస్తకాలు, పేపర్లు చదవలేదు. కాని గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఓ శునకం పేపర్ చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా.. మనుషులే కాదు..కుక్కలు కూడా పేపర్ చదవగలవా అంటూ అవాక్కవుతున్నారు. పేపర్ చదువుతున్న ఈ శునకం డ్రెస్ స్టైల్ కూడా అదరగొడుతోంది. ఒక సోఫాలో కూర్చుని..తెల్లటి చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని పేపర్ చదువుతూ స్టిల్ ఇవ్వగా.. దాని యజమాని ఈశునకం చేసే విన్యాసాలను వీడియోలో బంధించారు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈశునకం న్యూస్ పేపర్ ని తన కాళ్ల సాయంతో పట్టుకుని.. ఎంతో నిష్టతో పేపర్ చదువుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుటోంది. ఈ వీడియో చూస్తున్న వారంతా తమ స్టైల్లో స్పందిస్తున్నారు. మంచి బాలుడు వార్తలు చదువతున్నాడు..అతని చదువుకి అంతరాయం కలిగించవద్దని కొందరు, ఓ మై గాడ్ ఎవరైనా చదివేటప్పుడు కళ్ళు రెప్ప వేస్తారు.. ఈ శునకం మాత్రం కళ్ళు రెప్ప ఆర్పడంలేదంటూ ఈవీడియోకు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి