King Cobra: స్కూటర్‌లోకి దూరి బుసలు కొట్టిన నాగుపాము.. ఎలా బయటకు తీశాడో చూస్తే వణుకే పుట్టాల్సిందే

|

Nov 03, 2022 | 5:59 PM

ఓ స్కూటర్‌లోకి రహస్యంగా చొరబడింది కింగ్‌కోబ్రా. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే బుసలు కొట్టి అందరినీ భయపెట్టింది. చివరకు స్నేక్‌ క్యాచర్‌ వచ్చి చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

King Cobra: స్కూటర్‌లోకి దూరి బుసలు కొట్టిన నాగుపాము.. ఎలా బయటకు తీశాడో చూస్తే వణుకే పుట్టాల్సిందే
Giant Cobra
Follow us on

పాములో రెండు వేలకు పైగా జాతులున్నాయి. అందులో కొన్నింటిలో విషముంటే మరికొన్ని పాములు మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. అయితే విషమున్నా, లేకపోయినా పాము పేరెత్తగానే మనం భయంతో వణికిపోతాం. ఇక పొరపాటున కంటికి తారసపడితే క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుంటాం. ఇక పాముల్లో కింగ్ కోబ్రా కు ప్రత్యేక స్థానముంది. పాము జాతుల్లో ఇదే ప్రమాదకరమని, ఇందులోని విషం క్షణాల్లోనే మనుషుల ప్రాణాలను తీసేస్తాయని పేరుంది. కాగా ఇటీవల పాములు అడవులను దాటి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లు, గుళ్లు, పాఠశాలల్లోకి దూరి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అలా ఓ స్కూటర్‌లోకి రహస్యంగా చొరబడింది కింగ్‌కోబ్రా. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే బుసలు కొట్టి అందరినీ భయపెట్టింది. చివరకు స్నేక్‌ క్యాచర్‌ వచ్చి చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ.. అవినాష్‌ యాదవ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేసుకోవగా అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో ప్రకారం..యాక్టీవా స్కూటర్‌ ముందు భాగంలో ఓ నాగుపాము ఉంటుంది. దాన్ని బయటకు తీసేందుకు పాములు పట్టే వ్యక్తి శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ముందుగా స్క్రూ డ్రైవర్‌ సాయంతో యాక్టీవా ముందు భాగాన్ని తొలగిస్తాడు. అంతరం పామును బయటకు పంపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అది ఎంతకీ బయటకు రాదు. పైగా ఆ వ్యక్తిపైకి పడగ విప్పి బుసలు కొడుతూ తిరగబడుతుంది. అయినప్పటికీ ఆ స్నేక్‌ క్యాచర్‌ వెనక్కుతగ్గడు. చాలా సేపు శ్రమించి ఎంతో చాకచక్యంగా ప్రమాదకరమైన పామును చేత్తో బయటకు తీస్తాడు. అక్కడున్న వారు ఈ తతంగానికి సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు స్నేక్‌ క్యాచర్‌ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. మరి మీరూ ఈ వీడియోపై ఈ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..