Viral Video: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మనోడి ఐడియాకు దండేసి దండం పెట్టాల్సిందే.!
వద్దురా సోదరా.. డ్యాన్స్‌లన్నీ మనతోని కాదురా.. ఆగరా.. అలెర్ట్ అవ్వరా.. కొత్త డ్యాన్స్ స్టెప్పులు ట్రై చేస్తే ఇట్లానే ఉంటదిరా.. డోంట్ వర్రీ.. డ్యాన్స్‌లకు ఎందుకు హర్రీ..
ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..
వివాహం అనేది వధూవరులకు చాలా ప్రత్యేకమైనది. ఆ సమయంలో జరిగే ప్రతీ మూమెంట్ వారికి చాలా అపురూపమని చెప్పాలి. డ్యాన్స్‌లు, ఫ్రెండ్స్ చిలిపి చేష్టలు, అమ్మలక్కల ముచ్చట్లు, పెద్దల పలకరింపులు.. ఇలా ఒకటేమిటీ ఎన్నో విషయాలు వివాహాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది..
వైరల్ వీడియో ప్రకారం.. పెళ్లి రిసెప్షన్‌లో వధూవరులు ఇద్దరూ.. డీజేకి తగ్గట్టుగా డ్యాన్స్‌లు చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. వేడుకకు వచ్చిన అందరి ముందు పోజు కొట్టాలనుకున్నాడో.. లేక పెళ్లికూతురు ముందు తన స్టైల్ చూపించాలనుకున్నాడో గానీ పెళ్లి కొడుకుకు ఓ ఐడియా వచ్చింది. కష్టమైన డ్యాన్స్ స్టెప్ ఒకటి ప్రయత్నించాలనుకున్నాడు.. తన కాలుతో వధువు తలపై నుంచి స్టంట్ చేయాలని చూశాడు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. అతడి కిక్.. వధువు తలకి గట్టిగా తగిలింది. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Le falta un poco de agilidad pic.twitter.com/TREJBWvwsk
— Los Negros Del Ataúd ⚰ (@NegrosConAtaud) June 11, 2022
కాగా, ఈ వీడియోను ‘losnegrosdelataud’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు దీనికి 4 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ సారి వీడియో చూసేయండి.