Viral Video: యువకుడి తిక్క కుదిర్చిన కోతి.. దెబ్బకు బాబోయ్ అని గింజుకున్నాడు.. ఫన్నీ వీడియో మీకోసం..!
Viral Video: సాధారణంగా కోతులు చాలా అల్లరి చేస్తాయి. వాటి ముందు తేడాగా ప్రవర్తిస్తే ఇక అంతే సంగతి. ఒక్కోసారి అవి దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తాయి కూడా.
Viral Video: సాధారణంగా కోతులు చాలా అల్లరి చేస్తాయి. వాటి ముందు తేడాగా ప్రవర్తిస్తే ఇక అంతే సంగతి. ఒక్కోసారి అవి దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తాయి కూడా. వాటి అల్లరి ఎంత ఆకట్టుకుంటుందో.. వాటి దాడి కూడా అంతే భీకరంగా ఉంటుంది. అలాంటి కోతి మంది ఓ యువకుడు పిల్లకోతి చేష్టలు చేశాడు. మరి ఆ నిజమైన కోతి ఊరుకుంటుందా? అదును చూసి గట్టి షాక్ ఇచ్చింది. దెబ్బకు బాబోయ్ అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓ యువకుడు తన సన్నిహితులతో కలిసి ‘జూ’ కి వెళ్లాడు. అక్కడ ఒక బోనులో కోతి ఉంది. దానిని ఆ యువకుడు ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ కోతి ఊహించని రీతిలో రివర్స్ షాక్ ఇచ్చింది. దెబ్బకు బిత్తర పోవడం అతని వంతు అయ్యింది. కోతిని సమీపించిన ఆ యువకుడు ఏదో ప్రయోగం చేయబోగా.. కోతి అతని జుట్టును అందుకుంది. ఇంకేముంది.. మంచి ఛాన్స్ దొరికిందని భావించి ఆ మకరం.. జుట్టును బలంగా పీకడం మొదలు పెట్టింది. అతని జుట్టుకుని పట్టుకుని అటూ ఇటూ బలంగా తిప్పింది. కోతి దెబ్బకు ఆ యువకుడు అబ్బా అన్నాడు. చివరకు ఎలాగోలా ఆ కోతి చెర నుంచి తప్పించుకున్నాడు యువకుడు. అక్కడే ఉంటే మరేమైనా చేస్తుందేమోనని భయపడి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఈ సన్నివేశాన్నంతా ఫోన్ కెమెరాలో రికార్డ్ చేయగా.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. తిక్క చేష్టలు చేసే యువకుడికి కోతి సరైన గుణపాఠం చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనిని పాపం అంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఈ వీడియోకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
Also read: