AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటి అడుగున వింత జీవి.. నోటి నిండా పళ్లతో.. భయంకరమైన రూపంతో

కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఎన్నో రకాల వైవిధ్యాలకు గురై ప్రస్తుత రూపానికి వచ్చిందని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి భూమిపై ఉండే అత్యంత పెద్దవైన ఏనుగుల...

Viral Video: నీటి అడుగున వింత జీవి.. నోటి నిండా పళ్లతో.. భయంకరమైన రూపంతో
Shark Video Viral
Ganesh Mudavath
|

Updated on: Aug 13, 2022 | 7:56 PM

Share

కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఎన్నో రకాల వైవిధ్యాలకు గురై ప్రస్తుత రూపానికి వచ్చిందని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి భూమిపై ఉండే అత్యంత పెద్దవైన ఏనుగుల వరకు ఎన్నో రకాల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. ఎప్పటినుంచో జరుగుతోన్న ఈ మార్పు నేటికీ కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు, జీవన శైలి రకరకాలుగా మారిపోతున్నాయి. ఆదిమానవులు అడవులలో నివాసముండే కాలం నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి వరకు చేరుకున్నారు. వేల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి ఎన్నో రకాల జంతుజాతులు అంతరించిపోయాయి. ఈ క్రమంలో మిలియన్ల సంవత్సరాల నాటి ఒక జీవి మరోసారి భూమిపై కనిపించింది. ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. నిజమని నమ్మక తప్పదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లక్షల ఏళ్ల నాటి ఓ జీవి కనిపించింది. 80 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ జీవి నడయాడినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని ‘ది ఫ్రిల్డ్ షార్క్’ అని కూడా పిలుస్తారు. ఈ భయంకరమైన సొరచేప జపాన్‌లోని అవాషిమా ద్వీపంలో కనిపించింది.

ఈ సొరచేప నోటిలో 300 దంతాలు ఉండగా.. నీటిలో ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వింత షార్క్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 23 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.9 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. 78 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!