Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్.. బ్యాండ్‏తో ఊరేగింపుగా తీసుకెళ్లి మరి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

పెళ్లి (Wedding).. కుటుంబసభ్యులైనా... స్నేహితులు అయినా.. మంచి మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటారు. దేవతలు విగ్రహాలు..

Viral Video: స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్.. బ్యాండ్‏తో ఊరేగింపుగా తీసుకెళ్లి మరి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Wedding
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 10:00 AM

పెళ్లి (Wedding).. కుటుంబసభ్యులైనా… స్నేహితులు అయినా.. మంచి మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటారు. దేవతలు విగ్రహాలు.. ఫోటో ఫ్రేమ్స్.. లవబుల్ విగ్రహాలు.. రాధాకృష్ణ ఫోటోస్ ఇస్తుంటారు. ఇక ఇటీవల కొందరు తమ స్నేహితుల పెళ్లిలలో ఫన్నీ గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి షాకవుతున్నారు నెటిజన్స్.. తమ స్నేహితుడి పెళ్ళికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

అసలు విషయానికి వస్తే.. అందులో తమ స్నేహితురాలి పెళ్లి దాదాపు 200 పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని ఎదురుకోటకు చెందిన సుపురాజ్.. ముత్తులత్సుమి దంపతుల కుమారుడు నవనీతన్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి ఎదురుకోటలోని మీనాక్షిపురానికి చెందిన అనితతో వివాహం జరిపించారు. అయితే పెళ్లిలో వరుడు స్నేహితులు రూ. కోటి విలువైన 200 పైగా పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకాలన్నింటిని ప్లేట్స్ లలో అందంగా అమర్చి బ్యాండ్స్ తో ఊరేగింపుగా తీసుకెళ్లి మరి ఇచ్చారు. పుస్తకాలను ఊరేగించడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు