Telugu News Trending Fox enjoyed music video was gone viral in social media Telugu news
Viral Video: మ్యూజిక్ కు మైమరిచిపోయిన వన్యప్రాణి.. బుద్ధిగా కూర్చుని, ఆసక్తిగా ఆలకించి.. వీడియో వైరల్
మ్యూజిక్ (Music), సాంగ్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. జర్నీ చేసే సమయంలో సంగీతం వింటుంటే వచ్చే థ్రిల్లే వేరు. కొందరు పాత పాటలను ఇష్టపడితే మరి కొందరు మాత్రం కొత్తగా ట్రెండ్ అవుతున్న పాటలు..
మ్యూజిక్ (Music), సాంగ్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. జర్నీ చేసే సమయంలో సంగీతం వింటుంటే వచ్చే థ్రిల్లే వేరు. కొందరు పాత పాటలను ఇష్టపడితే మరి కొందరు మాత్రం కొత్తగా ట్రెండ్ అవుతున్న పాటలు వినేందుకు ఆసక్తి చూపిస్తారు. పాటలను ఇష్టపడేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. గాయనీ గాయకుల స్వరం, మ్యూజిక్, స్వరరాగాలు, లిరిక్స్ వంటివి పాటపై ప్రభావం చూపుతాయి. సంగీతానికి ప్రకృతి కూడా పులకరిస్తుందని చెబుతుంటారు. అయితే జంతువులు కూడా సంగీతాన్ని వినేందుకు ఇష్టపడతాయని మీకు తెలుసా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. , ఇందులో ఒక అడవి జంతువు ప్రశాంతంగా కూర్చుని మ్యూజిక్ ను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి గిటార్ ప్లే చేస్తుంటారు. ఆ సమయంలో అక్కడికి ఒక నక్క వస్తుంది. అది సంగీతాన్ని ఇష్టపడి అక్కడే కొంత సమయం కూర్చుని సంగీతం వింటుంది. వ్యక్తి తన చేతుల్లో గిటార్ తో ట్యూన్ వాయిస్తుండగా నక్క ఆనందంగా వినడాన్ని చూస్తుంటే దానికి సంగీతం అంటే ఇష్టం ఉన్నట్లు కనిపిస్తోంది.
కొంత సేపు విన్న తరువాత అక్కడ నుండి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది రెండు అడుగులు నడిచిన తర్వాత మళ్లీ ఆగిపోతుంది. సంగీతం విన్న తర్వాత నక్కకు అక్కడి నుండి వెళ్లాలని అనిపించకపోవచ్చని తెలుస్తోంది. అద్భుతమైన ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘సంగీతం వినడానికి నక్క కాసేపు ఆగిపోతుంది’ అనే శీర్షికతో షేర్ అయింది. కేవలం 35 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 35 వేలకు పైగా వ్యూస్, వందల లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.