AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీకో సవాల్.. ఆవుల మంద మధ్య నక్కి ఉన్న పెద్దపులిని మీరు కనిపెట్టగలరా..?

ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలలో ఒక మ్యాజిక్ దాగుంటుంది. ఇవి మన కళ్లను మాయ చేస్తాయి. కన్‌ఫ్యూజ్ చేస్తూ రివర్స్ గేమ్ ఆడతాయి.

Viral Photo: మీకో సవాల్.. ఆవుల మంద మధ్య నక్కి ఉన్న పెద్దపులిని మీరు కనిపెట్టగలరా..?
Spot The Tiger
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2022 | 5:54 PM

Share

Trending Photo: మిమ్మల్ని ఆకట్టుకునే.. అలరించే ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion)పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం. మీ కళ్ల దృష్టి అద్భుతమని మీరు భావిస్తున్నారా..? మీది ఇస్మార్ట్ బుర్ర అని అనుకుంటున్నారా..? అయితే ఈ పజిల్ సాల్వ్ చేయండి చూద్దాం. మరీ అంత క్లిష్టమైనది అయితే కాదండోయ్. కాస్త ఈజీనే. కొద్దిగా ఫోకస్ పెడితే ఈ ఫోటోలోని ఆవుల మంద మధ్య దాగున్న పులిని కనిపెట్టవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ఫోటో పజిల్స్ నెటిజన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. టైమ్ పాస్ మాత్రమే కాదు.. ఐ పవర్ టెస్ట్ చేసుకునేందుకు, బుర్రకు కాస్త మేత వేసేందుకు కూడా ఉపయోగపడతాయి. ఆవులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఓ మూలన నక్కి ఉంది రాయల్ బెంగాల్ టైగర్. దాన్ని కళ్లలో ఎంత పవర్ ఉంటుందో.. మీరు కూడా ఆ మాదిరి పవర్ ఉపయోగించి ఆ పెద్ద పులిని కనిపెట్టాలి. సెల్ఫ్ కాన్పిడెన్స్ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సమస్యలను స్వీకరిస్తారు. అటువంటివారు ఇలాంటి పజిల్స్ కూడా వదిలిపెట్టరు. మీకు ఆత్మవిశ్వాసం లేదనుకుంటేనే సమాధానం ఉన్న ఫోటోను చూడండి. కనీసం ట్రై కూడా చేయకుండా ఆన్సర్ ఉన్న ఫోటోను చూడకండి. 10 సెకన్లలో ఆ పులిని గుర్తిస్తే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఇక మావల్ల కాదు.. ఎంత చూసినా ఆ పులి కనపించట్లేదు అనిపిస్తే.. మేమే దిగువన ఆన్సర్ ఇస్తున్నాం చూసెయ్యండి.

Tiger

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..