Viral Video: ఈ యువకుడి ధైర్యానికి ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే.. మొసలికే చుక్కలు చూపించాడుగా.!

|

Sep 30, 2021 | 3:40 PM

Crocodile Viral Video: ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి జంతువులు అనుకోని అతిధులుగా రావడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిరుతలు..

Viral Video: ఈ యువకుడి ధైర్యానికి ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే.. మొసలికే చుక్కలు చూపించాడుగా.!
Crocodile Video
Follow us on

ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి జంతువులు అనుకోని అతిధులుగా రావడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిరుతలు, ఎలుగు బంట్లు, మొసళ్లు.. ఇలా ఒకటేమిటి క్రూర జంతువులన్నీ కూడా జనాల మధ్యకు రావడం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటికి మొసలి అనుకోని అతిధిగా వచ్చింది. ఇక దాన్ని చూసిన తర్వాత ఆ ఇంట్లో ఉంటున్న వాళ్లు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి..

సహజంగా మొసళ్లు నీటిలోనే ఎక్కువగా ఉంటాయి. వాటిని సముద్రపు అలెగ్జాండర్స్ అని పిలుస్తుంటారు. నీటిలో వెయ్యి ఏనుగుల బలం కలిగిన మొసలికి చిక్కితే.. ఇక అంతే ప్రాణాలు పోయినట్లే.. అంతటి బలశాలి అయిన మొసలి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం యూఎస్‌లోనే ఓ వ్యక్తికి ఎదురైంది.

వైరల్ వీడియో ప్రకారం.. తన పెరట్లో ప్రత్యక్షమైన మొసలిని ఓ వ్యక్తి ధైర్యంగా ఎదుర్కున్నాడు. కళ్లెదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా.. ఓ డస్ట్ బిన్‌తో మొసలిపై దాడి చేశాడు. అలా దానిని ఆ చెత్త డబ్బాలోకి తోసి మూత పెట్టాడు. అతడు చూపించిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read: