Optical Illusion: మెదడుకి మేత పెట్టే పజిల్.. కళ్లను మోసం చేస్తున్న పిల్లి.. వీడియో వైరల్
మెదడుకి మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియా లో చాలా కనిపిస్తూనే ఉంటాయి.. టెన్షన్స్ తగ్గాలన్నా.. స్ట్రస్ తగ్గిపోవాలన్న పజిల్స్ మనకు చాల సహాయం చేస్తుంటాయి.
Optical Illusion: మెదడుకి మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియా లో చాలా కనిపిస్తూనే ఉంటాయి.. టెన్షన్స్ తగ్గాలన్నా.. స్ట్రస్ తగ్గిపోవాలన్న పజిల్స్ మనకు చాల సహాయం చేస్తుంటాయి. అయితే మన కళ్లను కూడా నమ్మలేని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తారసపడుతూ ఉంటాయి. అవి మన కళ్ళను ఇట్టే మోసం చేస్తుంటాయి. కళ్ళు ఒక దాన్ని చూస్తాయి కానీ మన మెదడు మరొకటి అర్థంచేసుకుంటుంది. అయితే కొన్ని ఆప్టికల్ భ్రమలను డీకోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోతారు. కొన్ని సార్లు మనకళ్లు ఇలా మోసం చేస్తాయా అని అవాక్ అవుతారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక నల్లపిల్లి ఓ యాంగిల్ లో తిరుగుతూ కనిపించింది. అయితే ఏది ఏవైపుగా తిరుగుతుందో అర్ధం చేసుకోవడం కొంచం కష్టమే.. మొదట పిల్లి ఒక దిశలో మాత్రమే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది, కానీ మీరు దానిని చాలా సేపు చూసిన తర్వాత పిల్లి మరొక దిశలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఆ వీడియో మన కళ్లను మాయ చేసింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మన మనసు, మెదడు ఒకేలా ఆలోచిస్తే ఆ పిల్లి ఒక్క దిశలోనే తిరుగుతున్నట్టు కనిపిస్తుందని కొందరు అంటుంటే.. మరి కొందరు నిజంగానే కళ్లు మోసం చేస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. మరి మీ కళ్లు ఏం చెప్తాయో చూడండి.
మరిన్ని ఇక్కడ చదవండి :