మన మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచేందుకు పజిల్స్ ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఒకప్పుడు పజిల్స్ అంటే.. మనం ఏదైనా బుక్స్‌లోని ఫోటోలను, లేదా సుడోకోలను సాల్వ్ చేసేవాళ్లం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తుంటాయి. క్యూరియాసిటీలో భాగంగా ఆ ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? అనే వాటి కోసం వెతుకుతుంటాం. పజిల్స్‌ను సాల్వ్ చేసేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తుంది. తాజాగా అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడడానికి చుట్టూ చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఓ అడవిని తలపిస్తోంది కదూ. ఈ చెట్ల మధ్య ఓ సింహం దాగుంది. ఫోటోగ్రాఫర్ తన కెమెరా స్కిల్స్‌కు పదును పెట్టి ఈ ఫోటోను తీశాడు. ఇందులో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ లేదు. మీ కళ్లు నిజంగా డేగ కళ్లయితే.. ఫస్ట్ ట్రయిల్‌లోనే సింహాన్ని కనిపెట్టేస్తారు. లేదంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే.. దాన్ని మీరు కనిపెట్టవచ్చు. అయితే మీరు సింహాన్ని కనిపెట్టడంలో ఓ క్లూ ఇస్తా.. ఫోటోకు కుడివైపు పైభాగాన్ని పరిశీలిస్తే.. మీకు సమాధానం దొరుకుతుంది. లేదంటే ఆన్సర్ కోసం క్రింద వీడియోను చూడండి.
Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..
ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!