Photo Puzzle: తల గోక్కోవాల్సిందే.. ఈ ఫోటోలో పందికొక్కు ఎక్కడుందో చెప్పగలరా..?
ప్రస్తుత కాలంలో బ్రెయిన్‌కు పదును పెట్టే పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్, స్పాట్ ది డిఫరెన్స్, ట్రిక్కీ పజిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు కూడా ఫాలో అయ్యి వాళ్ల ఐక్యూ పవర్ ఎంతో టెస్ట్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ పజిల్ మీ కోసమే...

సోషల్ మీడియాలో జనం ఎక్కువగా ఇన్ స్టా, షార్ట్స్‌కు అలవాటుపడ్డారు. కంటెంట్ లెంగ్తీగా ఉంటే వెంటనే స్కిప్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం కాస్త డిఫరెంట్ కంటెంట్ వెతుకుతూ ఉంటారు. ఎలాంటి సవాళ్లు అయినా స్వీకరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారు పజిల్స్ చేధించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఈ ఫోటోలో ఏమేం వస్తువులు దాగి ఉన్నాయి. ‘ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టండి’, ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి’.. లాంటివి మీకు తారసపడే ఉంటాయి.
మీ అబ్జర్వేషన్ స్కిల్స్.. ఎలా ఉన్నాయి.. మీ ఐ ఫోకస్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ పజిల్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి కొన్ని పజిల్స్ బుర్రను యాక్టివ్ చేస్తాయి. సదరు ఫోటోలో ఏముందో కనిపెట్టేవరకు కొంతమంది విశ్రమించరు. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం నెట్టిట్ వైరల్ అవుతోంది. పైన ఫోటోను నిశితంగా గమనించండి. దాంట్లో ఓ పందికొక్కు నక్కి ఉంది. దాని జాడ మీరు చెప్పాలి. అది అంత ఈజీ కాదండోయ్. అక్కడున్న కట్టెల రంగు.. అది కలిసిపోయింది. ఇదొక చక్కటి ఆప్టికల్ ఇల్యూజన్.. మీ ఫోకస్ సూపర్ ఉన్నట్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లేదంటే ఆ పజిల్ మిమ్మల్ని తికమక పెడుతుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ ఫెయిల్ అయ్యారు. ఎంతసేపు చూసినా దాని జాడ తెలియకపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..