Viral video: ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్

పాము, ముంగిసల మధ్య వైరం ఎట్టా ఉంటదో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇవి రెండూ.. ఒకదానికొకటి ఎదురుపడితే భీకర ఫైట్ జరగాల్సిందే.

Viral video: ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్
Giant Cobra Vs Mongoose

Updated on: Nov 08, 2021 | 3:13 PM

పాము, ముంగిసల మధ్య వైరం ఎట్టా ఉంటదో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇవి రెండూ.. ఒకదానికొకటి ఎదురుపడితే భీకర ఫైట్ జరగాల్సిందే. ఈ వార్‌లో గెలుపు ఎవరిది అంటే చెప్పడం కష్టమే. వీటి మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరమే. ఎక్కవగా ముంగిసే పైచేయి సాధిస్తుంది. పెద్ద, పెద్ద పాముల మాత్రమే ముంగిసను అదుపుచేయగలవు. తాజాగా ఓ భారీ నాగు పాము, ముంగిసలు పోట్లాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భారీ పాము అనుకోకుండా ఓ గదిలో చిక్కుకుపోయింది. అది బయటకు వెళ్లేందుకు వీలు చిక్కలేదు. ఈ క్రమంలోనే రెండు ముంగిసలు కూడా అక్కడకు వెళ్లాయి. అయితే అవి భారీ పాము అనుకుని తటపటాయించాయో, ఏమో తెలియదు కానీ కాసేపు అక్కడక్కడే తారసలాడాయి. ఇంతలో ఒక ముంగిస నేరుగా పాము వద్దకు వెళ్లి దాన్ని కరిచే ప్రయత్నం చేసింది. దీంతో మెరుపు వేగంతో పాము కౌంటర్ అటాక్ చేసింది. అయితే పాము కాటు వేసేందుకు యత్నించగా… ముంగిస చాలా తెలివిగా తప్పించుకుంది. పాము సైజ్‌ ఎక్కువగా ఉండటం.. ఉధృతంగా అటాక్ చేయడంతో ముంగిస పోరాటం చేయలేక అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. పాము పడగవిప్పిన దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఆ వీడియోను దిగువన చూడండి.

Also Read:  పునీత్ రాజ్‌కుమార్ సంస్మరణ కార్యక్రమం.. నేత్రదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫ్యాన్స్