కొంతమందికి డాన్స్ అంటే పిచ్చి ఉంటుంది. స్టేజ్ ఏదైనా తమ డాన్స్ తో దుమ్మురేపుతారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ పిచ్చి కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే తన డాన్స్ కు అడ్డు వచ్చాడని ఓ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మాములుగా ఏదైనా ఈవెంట్స్ లో యువతులు డాన్స్ చేస్తుంటే యువకులు హంగామా చేయడం చూస్తుంటాం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే జరిగింది. ఈ వీడియోలో యువతులు డాన్స్ చేస్తుంటే.. కొంతమంది యువకులు స్టేజ్ పైకి ఎక్కి వారితో పాటు కలిసి డాన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఇద్దరు మహిళలు డ్యాన్స్ స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి కూడా డ్యాన్స్ చేయడానికి వేదికపైకి వచ్చాడు. అయితే అతడి వల్ల వాళ్ళ డాన్స్ డిస్ట్రబ్ అయ్యింది.
దాంతో ఆ యావతికి కోపం వచ్చింది. ఆమె చిర్రెత్తుకొచ్చి ఆ యువకుడిని ఎత్తుకొని గిరగిరా తిరగడం మొదలు పెట్టింది. చాలా వేగంగా అతడిని ఎత్తుకొని ఆమె తిరిగింది. దెబ్బకు ఆ యువకుడికి బుద్ధి వచ్చింది. ఈ వీడియో నవంబర్ 7న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 66 వేల మందికి పైగా వినియోగదారులు వీక్షించారు. వేలాది మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. కొంత మంది స్పందిస్తూ.. ఇప్పుడు డ్యాన్స్‌పై నమ్మకం పోయిందని రాశారు.
ये दोबारा कभी स्टेज पर नहीं नाचेगा
— राजस्थानी ट्वीट (@8PMnoCM) November 7, 2022
క్లిప్ కేవలం 25 సెకన్ల నిడివితో ఉంది, ఇక్కడ ఇద్దరు మహిళలు సాంప్రదాయ రాజస్థానీ దుస్తులలో వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నారు. ఓ యువకుడు కూడా వారి మధ్య డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అకస్మాత్తుగా ఆ మహిళా అబ్బాయిని ఎత్తుకుని వేదికపై గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత కొంత మంది వచ్చి యువకుడిని తీసుకెళ్తున్నారు.