Lava of Volcano Viral Video: ఈ ప్రపంచంలో అందాన్ని ఆనందాన్ని ఇచ్చే ప్రకృతి మాత్రమే కాదు.. ప్రళయాన్ని సృష్టించి.. ప్రపంచాన్ని అంతం చేసే అనేక రకాల ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. కనులు మూసి కనులు తెరచే లోపు మానవాళిని నాశనం చేయగలవు. అయితే ప్రకృతిలోని ఇన్ని ప్రమాదాలున్నా.. మనిషి సాటివారిమీద పై చేయి కోసం మరోవైపు ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేస్తూనే ఉన్నారు. అయితే, మానవులు ఎన్ని ప్రమాదకరమైన వస్తువులను తయారు చేసినప్పటికీ.. ఎప్పుడూ సహజ వస్తువులతో పోటీ పడలేరని ప్రకృతిలోని విపత్తులు అనేకసార్లు రుజువు చేశాయి. మానవాళి అంతం అవుతుందా అనిపించే ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడు అనేకం జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు సునామీ, కొన్నిసార్లు వరద, కొన్నిసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ఘటనల గురించి తెలుసు. ముఖ్యంగా అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి మాట్లాడితే.. వెంటనే ఇటలీ సంఘటన గుర్తుకొస్తుంది. సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇటలీలోని ప్రసిద్ధ పాంపీ నగర ప్రజలందరూ రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ప్రకృతి అత్యంత భయంకరమైన వినాశనాన్ని కలిగించింది. అగ్నిపర్వతంలోని లావా, బూడిదనగరాన్ని రాయిగా మార్చాయి. అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా వేడి ఎంత ప్రమాదకరమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..అందులో అగ్నిపర్వతం లావా నీరులా ప్రవహిస్తుంది.
అగ్నిపర్వతం లావా ఎంత వేగంగా ప్రవహిస్తుందో మీరు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిప్పుల నది ఉన్నట్లు అనిపిస్తుంది. పొరపాటున ఎవరైనా ఈ నదిలోకి వెళ్లినా, అతని శరీరమే కాదు, ఎముకలు కూడా కరిగిపోతాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా ఉష్ణోగ్రత దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని చెబుతున్నారు. అంటే లావా వేడి ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. వీడియోలో కనిపించిన దృశ్యం చూడడానికి అందంగా కనిపించినా.. అది సృష్టించే విధ్వసం హృదయ విదారకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Can you believe such a big amount of lava can flow this fast? This iconic video captured by photographer Ken Boyer shows Kilauea’s fissure 8 on June 16, 2018. No, it has not been sped up and this is the most stunning detail [full video: https://t.co/ELH9GRma7b] pic.twitter.com/81Ck865Tx5
— Massimo (@Rainmaker1973) January 17, 2022
ఈ షాకింగ్ వీడియో @CosmicGaiaX అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలియన్లు అంటే 12 లక్షల సార్లు వీక్షించగా, 39 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..