అరరే.. ఎంత పనైపోయింది..! థంబ్స్ అప్ ఎమోజీ పంపి రూ.60 లక్షలు నష్టపోయిన రైతు..!

|

Jul 11, 2023 | 8:17 AM

Dictionary.comలో ఎమోజీకి ఇచ్చిన అర్థాలలో, థంబ్స్ అప్ అంటే సమ్మతిని సూచించడం, ఆమోదం ఇవ్వడం. దీంతో రైతు ఒప్పందానికి అనుమతి ఇచ్చారు. ఒప్పందాన్ని చదవకపోవడం రైతు తప్పిదమే. అందువల్ల రైతు నష్టపరిహారంగా వ్యాపారికి రూ.60 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

అరరే.. ఎంత పనైపోయింది..! థంబ్స్ అప్ ఎమోజీ పంపి రూ.60 లక్షలు నష్టపోయిన రైతు..!
Emoji
Follow us on

డిజిటల్ యుగంలో అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. చర్చలు, ఒప్పందం, కంటెంట్ షేరింగ్, మీటింగ్, కాన్ఫరెన్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎమోజీల వాడకం పెరిగింది. ఎమోజీల ద్వారా రిప్లై ఇవ్వడం మామూలే.  మీరు  కూడా మెసేజ్‌లకు రిప్లై ఇచ్చేటప్పుడు ఎమోజీలను ఉపయోగిస్తున్నారా..? అయితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక రైతు తనకు వచ్చిన సందేశానికి థంబ్స్ అప్ ఎమోజీని పంపి చిక్కుల్లో పడ్డాడు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని కేసును పరిష్కరించగా, థంబ్స్ అప్ ఎమోజీ పంపిన రైతు చివరకు రూ.60 లక్షల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కెనడియన్ రైతు ఫ్లాక్స్‌తో సహా ఇతర పప్పులను పండించాడు. ఇందులో అవిసె గింజల కొనుగోలుకు వ్యాపారులతో చర్చించాడు. వారితో ఫోన్‌లో మాట్లాడారు. మొత్తం 86 టన్నుల అవిసె గింజల కొనుగోలుకు చర్చలు జరిపాడు. ఒక్కో బస్తాకు 12.73 డాలర్ల చొప్పున మొత్తం 86 టన్నులను కొనుగోలు చేస్తానని వ్యాపారి తెలిపారు. చర్చ అనంతరం ఆ వ్యాపారి మొబైల్‌కు లిన్సీడ్ కాంట్రాక్ట్ గురించి లేఖ పంపాడు.

‘ఎమోజి’ అనే యూనివర్సల్ లాంగ్వేజ్..

ఇవి కూడా చదవండి

ఒప్పంద పత్రం రాగానే రైతు మీ సందేశం అందిందని అర్థమయ్యేలా థంబ్స్ అప్ ఎమోజీని పంపారు. ఇది జరిగి నెల రోజులు కావస్తున్నా వ్యాపారికి ధాన్యం చేరలేదు. ఫోన్ కూడా రాలేదు. కాంట్రాక్ట్‌ ప్రకారం విత్తనాలు పంపించాలన్నారు. అయితే, ఎందుకు పంపలేదని అనుమానం వచ్చిన వ్యాపారి నేరుగా రైతు వద్దకు వచ్చి దౌర్జన్యం చేశాడు. నేను గత నెల రోజులుగా అవిసె గింజల కోసం ఎదురు చూస్తున్నాను. మరెక్కడా కొనకుండా కూర్చున్నాను. ప్రస్తుతం నాకు అవిసె గింజలు ఎక్కడా దొరకడం లేదు. మీరు అంగీకరించిన తర్వాత ఎందుకు పంపలేదని అడిగాడు. అందుకు రైతు అంగీకరించలేదు. మీరు ధర అడిగారు, నేను మీకు ధర చెప్పాను. నీకు ఇవ్వడానికి నేను ఒప్పుకోలేదని సమర్థించుకున్నాడు.

కానీ, వ్యాపారవేత్త తాను పంపిన లేఖను, అందుకు రైతు ఇచ్చిన సమాధానం థంబ్స్ అప్ ఎమోజీని చూపించాడు. దీన్ని కూడా రైతు సమర్థించుకున్నాడు. మీ మెసేజ్‌ అందిందని నేను బొటనవేలు చూపించాను..మెసేజ్‌ చూసిన మరుక్షణం మీకు థంబ్స్ అప్ ఇచ్చాను. కానీ, మీరు పంపిన ఒప్పంద లేఖను నేను చదవలేదని ఆ రైతు చెప్పాడు. కావాలంటే..అప్పుడు టైమ్‌ కూడా చూసుకోండి అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, సదరు వ్యాపారి కూడా వాదించాడు.. తాను ఈ వ్యాపారికి ఒప్పంద పత్రాన్ని పంపానని, అతడు దానికి థంబ్స్ అప్ ఎమోజితో అంగీకరించాడని చెప్పాడు. ధాన్యం పంపించకపోవటంతో నేను నష్టపోయానని వ్యాపారి వాదించాడు. దీంతో ఈ కేసు కోర్టుకు చేరింది.

ఈ కేసును విచారించిన కోర్టు ఎమోజీలకు సంబంధించిన అర్థాలపై ఆరా తీసింది. థంబ్స్ అప్ ఎమోజీకి అర్థం తెలుసుకున్న కోర్టు.. రైతు తప్పిదం ఇక్కడే కనిపిస్తోందన్నారు. Dictionary.comలో ఎమోజీకి ఇచ్చిన అర్థాలలో, థంబ్స్ అప్ అంటే సమ్మతిని సూచించడం, ఆమోదం ఇవ్వడం. దీంతో రైతు ఒప్పందానికి అనుమతి ఇచ్చారు. ఒప్పందాన్ని చదవకపోవడం రైతు తప్పిదమే. అందువల్ల రైతు నష్టపరిహారంగా వ్యాపారికి రూ.60 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..