Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మార్చే యోచనలో యాజమాన్యం.. నెట్టింట్లో ఫుట్‌బాట్ ఆడుకుంటున్న మీమర్స్..

Facebook Name Change: ప్రపంచంలో సగానికిపైగా జనాభా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మార్చే యోచనలో యాజమాన్యం.. నెట్టింట్లో ఫుట్‌బాట్ ఆడుకుంటున్న మీమర్స్..
Facebook
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:22 AM

Facebook Name Change: ప్రపంచంలో సగానికిపైగా జనాభా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు మొదలు ముసలి వాళ్ల వరకు అందరూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ కలిగి ఉన్నారు. తమ అభిప్రాయాలను, తమ అభిరుచులను పంచుకునేందేకు దీనిని ఒక సాధనంగా వినియోగిస్తున్నారు. చాలామంది ప్రజలు ఫేస్‌బుక్‌లో నిరంతరం యాక్టీవ్‌గా ఉంటారు. ఇంతలా పాపులర్ అయ్యింది ఫేస్‌బుక్. అయితే, ఈ ‘ఫేస్‌బుక్’కి సంబంధించి తాజాగా కీలక వార్త ప్రచారంలో ఉంది. రీ-బ్రాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని, ఫేస్‌బుక్‌ పేరును మారుస్తున్నట్లు విపరీతరంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నెటిజన్లు ఒక రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా ‘ఫేస్‌బుక్’ పేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇలాంటి ఫేస్‌బుక్ పేరు మారుస్తున్నారని తెలిసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీమ్స్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఫేస్‌బుక్ పని అయిపోయిందని, రిప్(రెస్ట్ ఇన్ పీస్) అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసినా ఇదే వరుస కనిపిస్తోంది.

ఇదిలఉంటే.. ఫేస్ బుక్ పేరుతో త్వరలోనే మారబోతోందని, దీనికి సంబంధించి వివరాలను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ వెల్లడిస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాబోయే వారంలో ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో కొత్త పేరును ప్రకటిచంనున్నారట. అక్టోబర్ 28వ తేదీన ఫేస్‌బుక్ కాన్ఫరెన్స్ జరుగబోతోందని, ఈ కాన్ఫరెన్స్‌లో జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్ కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది అంటూ ది వెర్జ్‌లో పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రమ్ మూడూ కలిపి ఒక యూనిట్‌గా పేరెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!