Viral News: అమ్మ బాబోయ్.. ఇలాంటి ఓనర్స్ కూడా ఉంటారా?.. స్నానం కూడా చేయొద్దంటే ఎలా బాసూ..!
House Rent: వ్యాపార అవసరాలు, ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినట్లయితే.. అక్కడ అద్దె గది చూసుకోవడం తలకు మించిని భారం అవుతుంటుంది.
House Rent: వ్యాపార అవసరాలు, ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినట్లయితే.. అక్కడ అద్దె గది చూసుకోవడం తలకు మించిని భారం అవుతుంటుంది. ఏదో ఒకటి దొరికిందనే సంతోష పడే లోపే.. వారు పెట్టే షరతులు మూర్చ తెప్పించేలా ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఓ రెంటర్‌కి ఎదురైంది. ఆ ఇంటి ఓనర్ పెట్టిన కండీషన్స్ చూసి షాక్ అయ్యాడు. ఇంగ్లండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంతకీ ఆ ఇంటి యజమాని పెట్టిన కండీషన్స్ ఏంటి? అంతలా కలవరపాటుకు గురి చేసే రూల్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌లోని నార్త్ మాంచెస్టర్‌లో ఓ వ్యక్తి తన ఇంటికి అద్దెకు ఇస్తున్నట్లుగా బోర్డు ఏర్పాటు చేశాడు. దాంతో పాటే.. కొన్ని షరతలు తెలుపుతూ నోటీసు పెట్టాడు. నోటీసులు చూడని వ్యక్తి నేరుగా ఇంటి యజమానికి గది అద్దెకు కోరాడు. ఆ సమయంలో ఇంటి యజమానికి షరతులు చూశారా? అంటూ ప్రశ్నించగా.. ఊహూ అంటూ అడ్డంగా తలూపారు రెంటర్. వెంటనే తన షరతులేంటో అతనికి విడమర్చి చెప్పాడు. అవన్నీ విన్న రెంటర్ మూర్ఛ వచ్చినంత పని అయ్యింది.
ఆ షరతుల్లో మొదటగా.. ఒక గది, వంట గది కలిగి రూమ్ కోసం అద్దెను 945 పౌండ్లు గా నిర్ణయించారు. (భారతీయ కరెన్సీలో 97 వేల రూపాయలు). అంతేకాదు.. రెంటర్ శాఖాహారీగా అయి ఉండాలి. కారణ.. ఇంటి యజమాని నాన్ వెజ్ తినడట. మ్యూజిక్ వినడానికి, టీవీ చూడటానికి నిర్ధిష్ట సమయాన్ని డిసైడ్ చేశాడు. అంటే.. రెంటర్ రాత్రి 9.30 గంటల తరువాత మ్యూజిక్ ప్లే చేయకూడదు. రాత్రి 8 గంటల తర్వాత స్నానం కూడా చేయకూడదు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఎవరైనా అతిథి వస్తే వారు రాత్రి 8 గంటల తర్వాత బాత్రూమ్ ఉపయోగించడానికి వీలు లేదు. ఇక వైఫైని యాక్సెస్ చేసుకోవాలంటే ఏడున్నర వేల రూపాయలు ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు, అద్దెదారు తన వద్ద ఎలాంటి పెంపుడు జంతువును ఉంచకూడదు. ఇక ప్రకటన చివరలో.. ‘‘ఇది మీది కాదు. నా ఇల్లు అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఈ అన్ని నియమాలను తూచా తప్పకుండా పాటించాలి.’’ అని రాయడం కొసమెరుపు. మొత్తానికి ఈ ప్రకటన సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
Also read:
Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..
Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తారు.. ఏ ఏ రాశుల వారంటే..